Asianet News TeluguAsianet News Telugu

ఆక్లాండ్ టీ20: వరుసగా రెండో విజయం.. కివీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

న్యూజిలాండ్ పర్యటనలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఆక్లాండ్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన నిర్దేశించిన 133 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కేవలం 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

India vs New Zealand, 2nd T20I: Match live updates, live scores
Author
Auckland, First Published Jan 26, 2020, 11:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూజిలాండ్ పర్యటనలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఆక్లాండ్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన నిర్దేశించిన 133 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కేవలం 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్ లోకేశ్ రాహుల్ 57, శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో ధాటిగా ఆడి భారత్‌కు విజయాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో సౌతీ 2, సోదీ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీమిండియా 5 టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. 

లక్ష్య ఛేదన కోసం ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ రోహిత్ శర్మ (8) సౌతీ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ధాటిగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (11)సైతం స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు. దీంతో భారత్ కాస్త ఇబ్బంది పడింది, అయితే ఓపెనర్ రాహుల్‌తో కలిసి శ్రేయస్ అయ్యర్ కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత విజయానికి 5 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్ (44) సోదీ బౌలింగ్‌లో సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శివమ్ దూబే (8)తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

టాస్‌గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఆదిలో గప్తిల్, మన్రోలు చాలా బ్రహ్మాండంగా ప్రారంభించారు. దాదాపుగా 9- 10 మధ్య రన్ రేట్ ని కొనసాగిస్తూ బౌండరీల వర్ష కురిపించారు. భయంకరమైన షాట్స్ కొడుతున్న గప్తిల్ ఔటవ్వడంతో మొదలైన కివీస్ పతనం ఏ కోణంలో తిరిగి వారు నిలబడగలుగుతారు అని అనిపించలేదు. 

కెప్టెన్ విలియమ్సన్ ఈ రోజు ఎందుకో అంత ఫ్రీ గా ఓపెన్ గా ఆడినట్టు కనిపించలేదు. అతడు బాగా తడబడ్డాడు. ఈ తరుణంలోనే అవతలి ఎండ్ లో వరుసగా వికెట్స్ పడడం, డాట్ బాల్స్ కూడా పెరుగుతూ ఉండడం అతని మీద ప్రెషర్ పెంచింది. అతను కూడా పెవిలియన్ చేరాడు. 

కేవలం కోల్పోయింది 5 వికెట్లే అయినా న్యూజిలాండ్ లో బిగ్ హిట్టింగ్ జోష్ కనిపించలేదు. భయంకరమైన హిట్టర్ రాస్ టేలర్, సెఫర్ట్ ఉన్నప్పటికీ వారు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లలేకపోయారు. 

భారత బౌలర్లు కివీస్ పైన ఆద్యంతం ప్రెషర్ పెంచగలిగారు. వారికి అసలు బంతులను టైం అవకుండా చాలా జాగ్రత్తగా పేస్, లెంగ్త్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ కివీస్ బ్యాట్స్ మెన్ ను తెగ ఇబ్బంది పెట్టారు. 

భారత బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారంటే... 17 వ ఓవర్ ఆరంభం నుంచి చివరి రెండు బంతుల వరకు ఒక్క బౌండరీ కూడా కివీస్ సాధించలేకపోయారు. 20వ ఓవర్లో 5వ బంతికి ఒక్క సిక్సర్ కొట్టగలిగారు కివీస్. ఓవరాల్ గా భారత్ బౌలర్లు ఈ ఫస్ట్ సెషన్ పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించారు అని చెప్పక తప్పదు. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గప్టిల్ 33, మున్రో 26, సీఫర్ట్ 33 పరుగులు చేశారు.

ప్లేయింగ్ ఎలెవన్ 

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివం దూబె, రవీంద్ర జడేజా,చాహల్, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా, శార్ధుల్ ఠాకూర్ . 

న్యూజిలాండ్‌ : మార్టిన్‌ గప్టిల్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, హామిష్ బెన్నెట్, బ్లెయిర్ టిక్నర్, టిమ్‌ సీఫర్ట్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమె, టిమ్‌ సౌథీ, ఇశ్‌ సోధి, మిచెల్‌ శాంట్నర్‌.

Follow Us:
Download App:
  • android
  • ios