Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్‌తో పింక్‌బాల్ టెస్ట్‌కు రెడీ అయిన భారత్: వేదిక ఎక్కడంటే..?

కరోనా వైరస్ ముప్పు కొద్ది కొద్దిగా తప్పుతుండటంతో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇందులో క్రీడలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020ని విజయవంతంగా నిర్వహిస్తున్న బీసీసీఐ.. త్వరలో మరిన్ని సిరీస్‌ల కోసం ప్లాన్ చేస్తోంది. 

India vs England Pink ball Test to be held in Ahmedabad next year
Author
New Delhi, First Published Oct 21, 2020, 4:23 PM IST

కరోనా వైరస్ ముప్పు కొద్ది కొద్దిగా తప్పుతుండటంతో అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ప్రజలు సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇందులో క్రీడలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2020ని విజయవంతంగా నిర్వహిస్తున్న బీసీసీఐ.. త్వరలో మరిన్ని సిరీస్‌ల కోసం ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే ఇంగ్లండ్‌ జట్టుతో కోహ్లి బృందం ఒక డే నైట్‌ టెస్టు ఆడుతుందని... పింక్‌ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌ వేదికగా అహ్మదాబాద్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి తెలిపారు.

కోల్‌కతా ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో భారత్‌లో ఇంగ్లండ్‌ పర్యటించాల్సి ఉంది.

సుదీర్ఘంగా సాగే ఈ పర్యటనలో ఇంగ్లండ్‌... ఐదు టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌ కూడా ఆడాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ సిరీస్‌ను కూడా యూఏఈలోనే నిర్వహిస్తారనే వార్తలు వినిపించినా... అవన్నీ ఊహాగానాలని గంగూలీ కొట్టి పారేశాడు.

భారత్‌లోనే ఈ సిరీస్‌ను నిర్వహించేలా బీసీసీఐ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. బయో సెక్యూర్ బబుల్స్‌ను నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నామని.. ఇందుకోసం అహ్మదాబాద్, కోల్‌కతా, ధర్మశాలలను పరిశీలిస్తున్నామని దాదా పేర్కొన్నారు.

దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం తమ దృష్టంతా త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనపై ఉందని గంగూలీ తెలిపాడు. కరోనా వల్ల ఇప్పటికే ఆలస్యమైన దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ తాజా సీజన్‌ను జనవరి 1న ఆరంభించే ఆలోచనలో ఉన్నట్లు సౌరవ్ చెప్పాడు. త్వరలో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై చర్చించి రంజీ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని గంగూలీ పేర్కొన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios