తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ ఆధిక్యం సాధించడంలో పంత్ పాత్ర చాలానే ఉంది. 

టీమిండియా వికెట్ కీపింగ్ బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్... ఈ మధ్యకాలంలో బాగా మెరుగయ్యాడు. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ధోనీ వారసుడిగా జట్టులోకి అడుగుపెట్టిన పంత్.. తొలి నాళ్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే... ఇప్పుడు మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఎలా ఇరగదీశాడో.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లోనూ కుమ్మేస్తున్నాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ ఆధిక్యం సాధించడంలో పంత్ పాత్ర చాలానే ఉంది. ఈ ఇన్నింగ్సులో పంత్ సెంచరీ కొట్టాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో పంత్‌కు ఇదే తొలి సెంచరీ. పంత్ సెంచరీ కొట్టగానే డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇప్పటికే వైరల్ అయింది.

View post on Instagram

ఇదిగో ఇప్పుడు ఈ రేసులో మరో బ్యాట్స్‌మెన్ చేరాడు. అతనే మన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. పంత్ సెంచరీ కొట్టిన సందర్భంగా అతనితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రోహిత్.. పంత్ ఆటతీరును మెచ్చుకున్నాడు. ‘‘మెంటలోడు కదా. కానీ బాగా ఆడావు స్పైడీ’’ ’’ అనిక్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్సులో 118 బంతులు ఎదుర్కొన్న పంత్ 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్సులో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.