Asianet News TeluguAsianet News Telugu

WTC 2023-25: చారిత్రాత్మక విజయం.. అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. 

WTC 2023-25 Points Table:  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియా 54.16 విజయాల శాతంతో సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 
 

India tops World Test Championship points table with a historic win against South Africa KRJ
Author
First Published Jan 5, 2024, 4:40 AM IST

WTC 2023-25 Points Table: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. మరోవైపు.. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న టీమిండియా సౌతాఫ్రికాను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా భారీ దూసుకెళ్లి నేరుగా అగ్రస్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా భారీ నష్టాన్ని చవిచూసింది. పాయింట్ల పట్టికలో రెండు స్థానానికి పడిపోయింది.  ప్రస్తుతం భారత్‌ 54.16 విజయాల శాతంతో అగ్రస్థానంలో నిలువగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లు ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. 

ఈ టోర్నీలో భాగంగా భారత్ ఇప్పటి వరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింట్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. వెస్టిండీస్‌ గడ్డపై 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత టీం.. తాజా సౌతాఫ్రికా పర్యటనలో 1-1తో సమం చేసుకుంది.

దాంతో 26 పాయింట్లతో అగ్రస్థానంతో పాటు పాయింట్ల శాతంతో 54 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది.ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లు ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 24కి 12 పాయింట్లు సాధించి ఆఫ్రికన్ జట్టు 50 శాతం మార్కులు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఏ జట్టు ఏ స్థానంలో ? 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​పాయింట్ల పట్టిక

1. భారతదేశం ( 54.16 )
2. దక్షిణాఫ్రికా ( 50.00)
3. న్యూజిలాండ్ ( 50.00)
4. ఆస్ట్రేలియా  (50.00)
5. బంగ్లాదేశ్ (50.00)
6. పాకిస్తాన్ (45.83)
7. వెస్టిండీస్  (16.67)
8. ఇంగ్లాండ్  (15.00)
9. శ్రీలంక (0.00)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios