నేటి నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ మొదలు... ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ ఇదే...
నేటి నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ... డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్..
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023, నేటి నుంచి మొదలుకానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది..
ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, కోల్‌కత్తాలో నవంబర్ 16న రెండో సెమీ ఫైనల్ జరుగుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగుస్తుంది. ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డేగా నవంబర్ 20ని కేటాయించారు.
చెన్నైలో అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో, అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో మ్యాచులు ఆడే టీమిండియా, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది.
నవంబర్ 2న ముంబైలో క్వాలిఫైయర్స్ నుంచి వచ్చే శ్రీలంక టీమ్‌తో, నవంబర్ 11న బెంగళూరులో నెదర్లాండ్స్ టీమ్‌తో టీమిండియా మ్యాచులు జరగబోతున్నాయి. నవంబర్ 5న కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు..
చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు వేదికల్లో మ్యాచులు ఆడుతున్న టీమిండియా, హైదరాబాద్‌లో మాత్రం ఒక్క వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడడం లేదు.
ICC Men's ODI World cup 2023 పూర్తి షెడ్యూల్ ఇదే:
తేదీ మ్యాచ్
అక్టోబర్ 5 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్
అక్టోబర్ 6 పాకిస్తాన్ vs నెదర్లాండ్స్
అక్టోబర్ 7 బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 7 సౌతాఫ్రికా vs శ్రీలంక
అక్టోబర్ 8 ఇండియా vs ఆస్ట్రేలియా
అక్టోబర్ 9 న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్
అక్టోబర్ 10 ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 11 ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 12 పాకిస్తాన్ vs శ్రీలంక
అక్టోబర్ 13 ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా
అక్టోబర్ 14 ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 15 ఇండియా vs పాకిస్తాన్
అక్టోబర్ 16 ఆస్ట్రేలియా vs శ్రీలంక
అక్టోబర్ 17 సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్
అక్టోబర్ 18 న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 19 ఇండియా vs బంగ్లాదేశ్
అక్టోబర్ 20 ఆస్ట్రేలియా vs పాకిస్తాన్
అక్టోబర్ 21 ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా
అక్టోబర్ 21 నెదర్లాండ్స్ vs శ్రీలంక
అక్టోబర్ 22 ఇండియా vs న్యూజిలాండ్
అక్టోబర్ 23 పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్
అక్టోబర్ 24 సౌతాఫ్రికా vs బంగ్లాదేశ్
అక్టోబర్ 25 ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్
అక్టోబర్ 26 ఇంగ్లాండ్ vs శ్రీలంక
అక్టోబర్ 27 పాకిస్తాన్ vs సౌతాఫ్రికా
అక్టోబర్ 28 నెదర్లాండ్స్ vs బంగ్లాదేశ్
అక్టోబర్ 28 ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్
అక్టోబర్ 29 ఇండియా vs ఇంగ్లాండ్
అక్టోబర్ 30 ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక
అక్టోబర్ 31 పాకిస్తాన్ vs బంగ్లాదేశ్
నవంబర్ 1 న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా
నవంబర్ 2 ఇండియా vs శ్రీలంక
నవంబర్ 3 నెదర్లాండ్స్ vs ఆఫ్ఘనిస్తాన్
నవంబర్ 4 ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా
నవంబర్ 4 న్యూజిలాండ్ vs పాకిస్తాన్
నవంబర్ 5 ఇండియా vs సౌతాఫ్రికా
నవంబర్ 6 బంగ్లాదేశ్ vs శ్రీలంక
నవంబర్ 7 ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్
నవంబర్ 8 ఇంగ్లాండ్ vs నెదర్లాండ్స్
నవంబర్ 9 న్యూజిలాండ్ vs శ్రీలంక
నవంబర్ 10 సౌతాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్
నవంబర్ 11 ఇండియా vs నెదర్లాండ్స్
నవంబర్ 12 ఇంగ్లాండ్ vs పాకిస్తాన్
నవంబర్ 12 ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్
నవంబర్ 15 సెమీ ఫైనల్ 1 (ముంబై)
నవంబర్ 16 సెమీ ఫైనల్ 2 (కోల్‌కత్తా)
నవంబర్ 19 ఫైనల్ (అహ్మదాబాద్)