పృథ్వీ షా ఎవరో కూడా తనకు తెలియదని సప్నా గిల్ కోర్టులో పేర్కొన్నారు. తన ఫ్రెండ్ అతడితో సెల్ఫీ కావాలని కోరారని, కానీ, తనకు అతనో క్రికెటర్ అని కూడా తెలియదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవాలే అని వాదించారు. 

ముంబయి: సెల్ఫీ కావాలనే డిమాండ్‌తో మొదలై క్రికెటర్ పృథ్వీ షా ఫ్రెండ్ కారును ధ్వంసం చేసే వరకు వెళ్లిన కేసులో సప్నా గిల్ ఈ రోజు అంధేరీ కోర్టులో మాట్లాడారు. ఈ కేసులో సప్నా గిల్‌ను ఈ నెల 20వ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే కోర్టులో సప్నా గిల్ మాట్లాడుతూ తనకు పృథ్వీ షా ఎవరో కూడా తెలియదని పేర్కొన్నారు.

సప్నా గిల్ న్యాయవాది మీడియా కథనాలను ఉటంకిస్తూ.. పృథ్వీ షాకు మద్యం తాగే అలవాటు ఉన్నదని తెలుస్తున్నదని, అందుకే బీసీసీఐ అతడిని బ్యాన్ చేసినట్టూ కథనాలు ఉన్నాయని అన్నారు. ‘రూ. 50 వేలు ఇస్తే ఈ కేసు ముగించేస్తాం అని సప్నా గిల్ అనలేదు. దీనికి అసలు ఆధారాలే లేవు. సప్నా కేవలం ఒక ఇన్‌ఫ్లూయెన్సర్. ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేయడానికి 15 గంటల సమయం పట్టింది. తన ఫ్రెండ్‌తో పృథ్వీ షా ఈ కేసు పెట్టించారు. అదే రోజు ఎందుకు కేసు నమోదు చేయలేదు?’ అని వాదించారు. 

Also Read: సప్న గిల్‌ హాట్ అందాలకి కుర్రాళ్లు ఫిదా... పృథ్వీ షాతో గొడవ పడి క్రేజ్ తెచ్చుకున్న ఇన్‌స్టా మోడల్...

అదే విధంగా సప్నా మాట్లాడుతూ తనకు పృథ్వీ షా ఎవరో కూడా తెలియదని అన్నారు. ‘నా ఫ్రెండ్ అతడిని సెల్ఫీ కావాలని అడిగాడు. నాకు అసలు అతను ఓ క్రికెటర్ అని కూడా తెలియదు. అక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. కానీ, పృథ్వీ షా వాళ్లు ఎనిమిది మంది మిత్రులతో ఉన్నారు. ఆ హోటల్‌లో వారు భోజనం చేశారనే మాట అవాస్తవం. మేం క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నాం. అతను తాగి ఉన్నాడు. ఈ ఘటనను ఇక్కడితో ముగించేయాలని పోలీసులు మమ్మల్ని అడిగారు.’ అని ఆమె పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడుతూ, తన క్లయింట్ పై పృథ్వీ షా చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని వాదించారు. ఆ ఆరోపణలు అన్నీ తప్పుడివేనని కోర్టులో తమ వైఖరి స్పష్టం చేశామని తెలిపారు. తర్వాతి విచారణలో సప్నా గిల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరుతామని, ఆ తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేస్తామని వివరించారు. ఎందుకంటే పోలీసులు అందులో సెక్షన్ 387 యాడ్ చేశారని అన్నారు.