Asianet News TeluguAsianet News Telugu

హెల్మెట్‌పై అవగాహన కల్పించడానికి రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్‌లను వాడిన హైదరాబాద్ పోలీసులు.. ట్వీట్ వైరల్

Hyderabad City Police: రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించే హెల్మెట్ వాడకాన్ని పెంచడానికి హైదరాబాద్ పోలీసులు తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.. 

Hyderabad City Police Shares Rohit sharma and Dinesh Karthik Cryptic Photo to Aware Traffic Rules
Author
First Published Sep 27, 2022, 12:17 PM IST

ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లో టీమిండియా  సారథి రోహిత్ శర్మ,  వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లకు సంబంధించిన ఓ ఫోటోను ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా వాడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో హెల్మెట్ ప్రాధాన్యతను తెలపడానికి పోలీసులు ఈ ఫోటోను వాడారు. హెల్మెట్ వాడకానికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ పాపులర్ సినిమా డైలాగులు, ఫోటోలు, పాటలతో రూపొందించిన మీమ్స్ తో నిత్యం ప్రజలకు అవగాహన కల్పించడంంలో ముందుండే పోలీసులు.. తాజాగా రోహిత్-కార్తీక్ ల ఫోటోను కూడా వాడుకున్నారు. 

ఆసీస్ తో మొహాలీలో ముగిసిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ.. స్టీవ్ స్మిత్ ఔట్ కు  సంబంధించి దినేశ్ కార్తీక్ తో ఫన్నీగా వ్యవహరించిన ఘటనకు సంబంధించినది ఆ ఫోటో. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్  క్యాచ్ ను అందుకున్న కార్తీక్.. అవుట్ కోసం అప్పీల్ చేయలేదు. 

అయితే ఉమేశ్ తో పాటు రోహిత్, ఇతర ఆటగాళ్లు దానిని అవుట్ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో  రోహిత్ దానిపై రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి.. స్మిత్ బ్యాట్ ను ముద్దాడుతూ వెళ్లి కార్తీక్ చేతుల్లో పడింది. కాగా.. రివ్యూ కోరే సమయంలో రోహిత్ కార్తీక్ దగ్గరికెళ్లి  ‘నువ్వెందుకు అప్పీల్ చేయలేదు’ అన్నంత కోపంతో  అతడి ముఖాన్ని పట్టుకుని  నలిపేసే ప్రయత్నం (ఫన్నీగా) చేశాడు. రివ్యూలో అవుట్ అని తేలాక  కార్తీక్ హెల్మెట్ పై ముద్దు పెట్టాడు. ఈ రెండు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

 

తాజాగా సిటీ పోలీసులు కూడా ఈ రెండు ఫోటోలను జత చేస్తూ   మీమ్స్ రూపొందించారు. మొదటి ఫోటోలో రోహిత్.. కార్తీక్ ముఖాన్ని నలిపేసేదాన్ని పెట్టి ‘హెల్మెట్ పెట్టుకోనప్పుడు..’ అని, రెండో ఫోటోలో ‘హెల్మెట్ పెట్టుకున్నప్పుడు’ అని రాసి ఉన్న మీమ్ ను  హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios