India vs Australia 2nd Test: సూర్యకుమార్ యాదవ్ పక్కన కూర్చొన్ని మ్యాచ్‌ని ఎంజాయ్ చేసిన హార్ధిక్ పాండ్యా!? టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటూ అనుమానాలు.. అసలు నిజం ఏంటంటే.. 

టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వాలంటైన్స్ డే రోజున తన భార్య నటాశా స్టాంకోవిక్‌ని మరోసారి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ ఘనంగా డబ్బులు తగలేసిన హార్ధిక్ పాండ్యా, రెండోసారి హానీమూన్ కూడా జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీ ముగిసే వరకూ హార్ధిక్ పాండ్యాకి పెద్ద పనేం లేదు. ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో పాండ్యా టీమ్‌తో కలుస్తాడు. అయితే ఢిల్లీ టెస్టులో హార్ధిక్ పాండ్యా, తళుక్కున మెరవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆట మూడో రోజున టీమిండియా డగౌట్‌లో సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్‌లతో కలిసి హార్ధిక్ పాండ్యా కూర్చొని ఉండడం కనిపించింది...

Scroll to load tweet…

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ మ్యాట్ రెంషా అవుట్ అవ్వగానే సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కలిసి డకౌట్‌లో సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. హార్ధిక్ పాండ్యాకి టెస్టు టీమ్‌తో పనేంటి? అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు...

2017లో టీమిండియా తరుపున అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేసిన హార్ధిక్ పాండ్యా, భారత జట్టు తరుపున 11 టెస్టులు ఆడి ఓ సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 532 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు తీశాడు. 2018లో జరిగిన ఇంగ్లాండ్ టూర్ టెస్టు సిరీస్ తర్వాత హార్ధిక్ పాండ్యా సుదీర్ఘ ఫార్మాట్‌కి దూరంగా ఉన్నాడు..

2018 ఆసియా కప్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్ధిక్ పాండ్యా, వెన్నెముకకి సర్జరీ చేయించుకున్నాడు. రెండేళ్ల పాటు బౌలింగ్‌కి దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా, 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమ్‌కి దూరంగా ఉన్నాడు. 

ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్సీ చేసి టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సక్సెస్ కావడంతో టీమిండియాకి టీ20 కెప్టెన్‌గానూ కొనసాగుతున్నాడు..

హార్ధిక్ పాండ్యా, టెస్టుల్లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా? సూర్యకుమార్ యాదవ్ పక్కన పాండ్యాని చూడగానే చాలామందికి కలిగిన సందేహం ఇదే. అయితే ఇందులో నిజం లేదు. ఢిల్లీ టెస్టుకి హార్ధిక్ పాండ్యా రాలేదు. సూర్యకుమార్ యాదవ్ పక్కన కూర్చున్న వ్యక్తి దయా. టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్‌లోని దయా.. జనవరిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ సమయంలో శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో కలిసి వీడియోలో కనిపించాడు..

హార్ధిక్ పాండ్యా సన్‌గ్లాసెస్ పెట్టి, అదే హెయిర్ స్టైల్, అదే స్టైల్‌లో గడ్డం పెంచడంతో అందరూ దయాని చూసి, కంఫ్యూజ్ అవుతున్నారు. వన్డే ఫార్మాట్ ఆడేందుకే తెగ ఇబ్బంది పడుతున్న హార్ధిక్ పాండ్యా... టెస్టు ఫార్మాట్‌ ఆడడం కష్టమే...