టీమిండియా క్రికెటర్, ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్... హార్దిక్ పాండ్యా .. అతని భార్య నటాషాది ప్రేమ వివాహం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జోడి వీలు కుదిరినప్పుడల్లా ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రేమ చాటుకుంటూనే ఉంటారు. 

వీరిద్దరి జోడి చాలా బాగుంటుంది. ఇద్దరూ స్టైలిష్ గా రెడీ అవుతూ ఉంటారు.  పాండ్యా తన వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా.. నటాషా.. కొడుకు పనిలో ఎంత తీరక లేకున్నా.. కలిసి సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలోనే సరదాగా డ్యాన్సులు కూడా వేస్తుంటారు.

సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తమకు ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఏ మాత్రం సంకోచించరు. తాజాగా.. నటాషా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టన్నింగ్ ఫోటో షేర్ చేశారు.

 

ఆ ఫోటోలో ఆమె  చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఆమెను అలా చూస్తే.. ఓ బిడ్డకు తల్లి.. కొద్ది నెలల క్రితమే డెలివరీ అయ్యిందంటే.. అస్సలు నమ్మలేరు. అంత ఫిట్ గానూ.. అందంగానూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో ఆమెను చూస్తే.. అభిమానులు కూడా చూపు తిప్పుకోలేరు. అంత అందంగా ఉంది. అందుకే ఆమె పోస్టుకి హార్దిక్ పాండ్యా కూడా వెంటనే స్పందించారు.

రెండు హార్ట్ ఎమోజీలను కామెంట్ రూపంలో పెట్టారు.  కాగా.. ఈ పోస్టుకి  ఆమె ఫోటో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే  లైకుల వర్షం కురిసింది. దాదాపు 2.5 లక్షల మంది ఆ ఫోటోని లైక్ చేయడం విశేషం.