Asianet News TeluguAsianet News Telugu

అబుదాబి టీ10 లీగ్‌లో హర్భజన్ సింగ్... ఢిల్లీ బుల్స్ తరుపున ఆడబోతున్న భజ్జీ...

అబుదాబి టీ10 లీగ్‌లో ఢిల్లీ బుల్స్ తరుపున ఆడబోతున్న హర్భజన్ సింగ్... ప్లేయర్‌గానే కాకుండా మెంటర్‌గా వ్యవహరించబోతున్న భజ్జీ... 

Harbhajan Singh going to play for Delhi Bulls in Abu Dhabi T10 League 6th Season
Author
First Published Sep 30, 2022, 4:13 PM IST

టీమిండియాలో చోటు కోసం దాదాపు ఆరేళ్ల పాటు వేచి చూసి అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్... విదేశీ ఫ్రాంఛైజీ లీగుల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. అబుదాబి టీ10 లీగ్ సీజన్ 6లో ఢిల్లీ బుల్స్ తరుపున ఆడబోతున్నాడు హర్భజన్ సింగ్. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కెప్టెన్సీలో ఢిల్లీ బుల్స్ తరుపున ఆడబోతున్నాడు భజ్జీ...

ఈ ఏడాది నవంబర్ 22 నుంచి డిసెంబర్ 4 వరకూ యూఏఈలో అబుదాబి టీ10 సీజన్ 6 జరగనుంది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన హర్భజన్ సింగ్, చివరిసారిగా 2016లో భారత జట్టు తరుపున మ్యాచ్ ఆడాడు...

ఆ తర్వాత ఐపీఎల్‌లో కొనసాగుతూ వచ్చిన హర్భజన్ సింగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడాడు. భారత జట్టు తరుపున 103 టెస్టులు ఆడి 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా టాప్ 3లో ఉన్నాడు....

236 వన్డేలు ఆడి 269 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. 

‘అబు దాబీ టీ20 లీగ్‌లో ఢిల్లీ బుల్స్ తరుపున ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ పొట్టి ఫార్మాట్ నాకు కొత్త ఛాలెంజ్. ఎందుకంటే 10 ఓవర్లలో మనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేయాలంటే బౌలర్లకు తేలికైన విషయం కాదు. టీమ్ యజమాని నీలేశ్ భత్‌నగర్‌తో నేను మాట్లాడాను. ఆయన నాకు మంచి స్నేహితుడు. టీమ్‌పైన తనకున్న కమిట్‌మెంట్ నచ్చి, అబుదాబి టీ10 లీగ్ ఆడేందుకు ఒప్పుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

అబుదాబి టీ20 లీగ్‌లో ఢిల్లీ బుల్స్, రెండు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఆండ్రూ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీ బుల్స్ టీమ్‌లో ఆస్ట్రేలియా యంగ్ సెన్సేషన్ (సింగపూర్ ప్లేయర్) టిమ్ డేవిడ్, రెహ్మనుల్లా గుర్భాజ్, విల్ జాక్స్, డొమినిక్ డ్రాక్స్, ఫజల్‌హక్ ఫరూకీ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఈ యంగ్ టీమ్‌లో 42 ఏళ్ల సీనియర్ హర్భజన్ సింగ్ ఎలాంటి మార్కు వేస్తాడో చూడాలి...

‘హర్భజన్ సింగ్ ఓ క్రికెట్ లెజెండ్. భారత జట్టుకి ఆయన ఎన్నో విజయాలు అందించాడు. ఐపీఎల్‌లోనూ టాప్ క్లాస్ పర్పామెన్స్ ఇచ్చి మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపు తిప్పాడు. ఢిల్లీ బుల్స్ తరుపున భజ్జీ ఆడేందుకు అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి హర్భజన్ సింగ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తాడని ఆశిస్తున్నాం.. ప్లేయర్‌గానే కాకుండా ఆయనకున్న అమితమైన అనుభవంతో ఢిల్లీ బుల్స్ జట్టుకి మెంటర్‌గానూ వ్యవహరించబోతున్నాడు హర్భజన్ సింగ్...’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ బుల్స్ ఫ్రాంఛైజీ యజమాని నీలేశ్ భత్‌నగర్‌... 

Follow Us:
Download App:
  • android
  • ios