ఎవ‌రీ శ‌శాంక్ సింగ్.. పొర‌పాటున టీమ్ లోకి వ‌చ్చి.. మొత్తం మార్చిప‌డేశాడు.. !

GT vs PBKS: ఐపీఎల్ 2024 17వ మ్యాచ్‌లో సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు శశాంక్ సింగ్. ఈ ప్లేయ‌ర్ హిట్టింగ్ ముందు శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్ క‌నిపించ‌కుండా పోయింది. 
 

GT vs PBKS: Who is Shashank Singh.. Come into the team by mistake.. He changed the whole thing IPL 2024 RMA

GT vs PBKS : శ‌శాంక్ సింగ్.. ఇప్పుడు ఇదే పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. ఎందుకంటే శుభ్ మ‌న్ గిల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో పంజాబ్ కింగ్స్ ముందు గుజ‌రాత్ టైటాన్స్  భారీ టార్గెట్ ను ఉంచింది. ఆట స‌గం పూర్త‌యిన త‌ర్వాత పంజాబ్ గెలిచే అవ‌కాశ‌మే లేద‌నే టాక్ మొద‌లైంది. కానీ, ఎప్పుడైతే శ‌శాంక్ సింగ్ క్రీజులోకి వ‌చ్చాడు.. కొద్ది సేప‌టికే మ్యాచ్ స్వ‌రూపం మార్చిప‌డేశాడు. గుజ‌రాత్ నుంచి మ్యాచ్ ను లాగేసుకుని పంజాబ్ గ్రౌండ్ లోకి తీసుకువ‌చ్చాడు. ఐపీఎల్ లో గుర్తుండిపోయే అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో పంజాబ్ కు విజ‌యాన్ని అందించాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్.. శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ ఇన్నింగ్స్ (89* ప‌రుగులు) తో 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. పంజాబ్ ముందు 200 ప‌రుగులు భారీ టార్గెట్ ను ఉంచింది.  యంగ్ ప్లేయ‌ర్లు శ‌శాంక్ సింగ్, అశుతోష్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో 200 ప‌రుగులు భారీ టార్గెట్ ను ఛేధించింది పంజాబ్. ఈ మ్యాచ్ లో ఏ ప‌రిస్థితిలోనూ పంజాబ్ గెలిచే అవ‌కాశాలు క‌నిపించ‌లేదు కానీ, ఎప్పుడైతే శ‌శాంక్ సింగ్ క్రీజులోకి వ‌చ్చాడే అప్ప‌టి నుంచే గేమ్ ను పంజాబ్ వైపు తీసుకురావ‌డం షురూ చేశాడు. గుజ‌రాత్ 199/4 ప‌రుగులు చేయ‌గా, పంజాబ్ 19.5 ఓవ‌ర్ల‌లో 200/7 విజ‌యాన్ని అందుకుంది. శ‌శాంక్ సింగ్ 29 బంతుల్లో 61 ప‌రుగులు సాధించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. మ‌రో ఎండ్ లో అశుతోష్ శర్మ 31 ప‌రుగుల ఇన్నింగ్స్ తో పంజాబ్ గెలుపులో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

రావడం రావడమే ఉతికిపారేస్తున్నారు.. ఇదెక్కడి ఆటరా నాయనా.. !

ఎవ‌రీ శ‌శాంక్ సింగ్..?

ఐపీఎల్ ఆక్షన్‌లో పొరపాటున పంజాబ్ జట్టు కొనుగోలు చేసిన ఆటగాడు శ‌శాంక్ సింగ్. పొర‌పాటున జ‌ట్టులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో వంటి బ్యాట్స్‌మెన్‌లు ఫ్లాప్‌గా తేలినప్పుడు శశాంక్ బ్యాట్ అహ్మదాబాద్‌లో త‌న ప‌వ‌ర్ చూపిస్తూ మాట్లాడింది. క‌ష్ట‌స‌మ‌యంలో బిగ్ మ్యాచ్ విన్నింగ్ ఫిఫ్టీని సాధించి, పంజాబ్‌కు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. దీంతో త‌న పొర‌పాటుకు పంజాబ్ ఏమాత్రం పశ్చాత్తాపపడదు. వేలం స‌మ‌యంలో పొర‌పాటును చిప్పి అత‌న్ని జ‌ట్టునుంచి వెన‌క్కి పంపాల‌ని చూశారు పంజాబ్ కింగ్స్ య‌జ‌మాని ప్రీతిజింటా కానీ, నిబంధనలు అడ్డురావ‌డంతో శశాంక్ పంజాబ్ జట్టులో ఉన్నాడు. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు పంజాబ్‌ అతడిని కొనుగోలు చేసింది.

త‌న‌ను తీసుకోవ‌డం పొర‌పాటు కాద‌ని నిరూపించాడు శ‌శాంక్ సింగ్. ఆరో స్థానంలో వచ్చిన శశాంక్ తన బ్యాటింగ్ తో మ్యాచ్ కు ప్రాణం పోశాడు. అతను కేవలం 29 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 61 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆడాడు. శశాంక్ సింగ్ సింగ్ వయసు 32 ఏళ్లు. 2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్ కంటే ముందు, శశాంక్ ఢిల్లీ, హైదరాబాద్, రాజస్థాన్ జట్లలో కూడా ఒక భాగంగా ఉన్నాడు. శశాంక్ సింగ్ 58 దేశవాళీ టీ20లు ఆడాడు. 137.34 స్ట్రైక్ రేట్‌తో 754 పరుగులు చేశాడు. 32 ఏళ్ల ఆల్‌రౌండర్ జాతీయ స్థాయిలో ఛత్తీస్‌గఢ్ తరపున ఆడుతున్నాడు.

 

GT VS PBKS HIGHLIGHTS : వాట్ ఏ మ్యాచ్.. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ పోరు.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios