Asianet News TeluguAsianet News Telugu

ఇంతకంటే బెటర్ ఇన్నింగ్స్ ఆడలేవనుకున్న ప్రతీసారి సర్ప్రైజ్ చేస్తున్నావ్.. సూర్య‌పై హెడ్‌కోచ్ ప్రశంసలు

INDvsSL: టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్  నిన్న శ్రీలంకతో   జరిగిన మూడో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన టీ20 కెరీర్ లో మూడో సెంచరీ చేసి  భారత్ కు భారీ విజయాన్ని అందించాడు. 
 

Every time I think I have not seen a better T20I innings But : Rahul Dravid praised Surykumar Yadav
Author
First Published Jan 8, 2023, 11:38 AM IST

నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీలంకతో శనివారం రాత్రి రాజ్‌కోట్ వేదికగా ముగిసిన మూడో  మ్యాచ్ లో  భారీ హిట్టింగ్ తో సెంచరీ చేసిన సూర్య.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.   9 సిక్సర్లు, ఏడు ఫోర్లతో  26 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన సూర్య.. తర్వాత 19 బంతుల్లోనే  మిగతా యాభై పరుగులు బాది  తన కెరీర్ లో మూడో  టీ20 సెంచరీ సాధించాడు.  మ్యాచ్ ముగిశాక  ద్రావిడ్.. సూర్యను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 

సూర్యను అండర్-19   రోజుల నుంచి  అబ్జర్వ్ చేస్తున్న ద్రావిడ్.. ఇంటర్వ్యూలో మాత్రం తన టీ20 కెరీర్ గురించి ప్రశ్నలు అడిగాడు. సూర్యతో.. ‘నువ్వు చిన్నప్పుడు కచ్చితంగా  నా బ్యాటింగ్ చూసుండవు...’ అని అనగానే అప్పుడు మిస్టర్ 360 నవ్వుతూ ‘లేదు లేదు.. నేను చూశాను..’ అని బదులిచ్చాడు.  

ఆ తర్వాత ద్రావిడ్..‘సరే అయితే.. కానీ సూర్య ఇది అద్భుతం.  నువ్వు ఉన్న ఫామ్  మాములుగా లేదు.  నువ్వు బ్యాటింగ్ కు వెళ్లి వీర బాదుడు బాదిన ప్రతీసారీ  నేను నీ నుంచి ఇంతకంటే బెటర్ ఇన్నింగ్స్ చూడలేనమో అని అనుకుంటా. కానీ ప్రతీసారి నువ్వు నన్ను కొత్త  కొత్త షాట్లతో  సర్ఫ్రైజ్ చేస్తూనే ఉన్నావ్.  గత ఇన్నింగ్స్ కంటే బెటర్ ఇన్నింగ్స్ ఆడుతున్నావ్..’ అంటూ ప్రశంసలు కురిపించాడు. గతేడాది నుంచి ఇప్పటివరకూ నీ బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ లో రెండింటిని ఎంచుకోమంటే నువ్వు ఏది ఎంచుకుంటావ్..?’ అని  ప్రశ్నించాడు.  

దానికి సూర్య స్పందిస్తూ.. ‘నేను బ్యాటింగ్  ను ఆస్వాదిస్తా. మరీ ముఖ్యంగా  జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను బ్యాటింగ్ చేయడాన్ని బాగా  ఎంజాయ్ చేస్తా.  నా బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ లో రెండింటిని ఎంచుకోలేను. అది  చాలా కష్టం.  ప్రతీ ఇన్నింగ్స్ ను చాలా ఎంజాయ్ చేస్తూ ఆడా. గతేడాది తో పాటు ఈ ఏడాది ఆడిన మూడు ఇన్నింగ్స్ అలాంటివే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేను బ్యాటింగ్ కు వెళ్లి  బాగా ఆడి టీమ్ ను గెలిపించిన  మ్యాచ్ లు నాకు చాలా ఇష్టం.. అవి నేను  బాగా ఆస్వాదించా..’ అని అన్నాడు. 

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..  రాజ్‌కోట్ వేదికగా ముగిసిన మూడో మ్యాచ్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.   తర్వాత   లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 137 పరుగులకే ఆలౌట్ అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios