ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. 

ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చింది. భీకర ఫాంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఈసారి ఎలాగైనా వరల్డ్‌కప్ సాధించాలని పట్టుదలగా ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో పాక్ చేతిలో ఓటమి ఆ జట్టు నైతిక స్థైర్యాన్ని కాస్త దెబ్బ తీసింది. కాగా పరాజయంపై ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు. ఫీల్డింగ్‌లో లోపాలే తమ జట్టు ఓటమికి కారణమన్నాడు.

ట్రెంట్ బ్రిడ్జ్ వంటి పిచ్‌పై భారీ స్కోరు ఖాయమని ముందే తెలుసునని.. దీనికి తోడు పాక్ నిర్దేశించిన లక్ష్యం కూడా ఛేదించగల్గినదేనని.. అయితే కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడం తమ విజయావకాశాలను దెబ్బ తీశాయని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

ఇదేమీ చెత్త ప్రదర్శన కాదని.. జట్టుగా తాము బ్యాట్, బంతితో బాగా ఆడామన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో తమ శక్తి మేరకు గెలుపు కోసం పోరాటం చేశామని.. కానీ కొన్ని తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చిందని మోర్గాన్ చెప్పాడు.