కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న యంగ్ పేసర్ శివమ్ మావి, గత రెండు సీజన్లుగా మంచి పర్ఫామెన్స్‌తో క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ను డకౌట్ చేసిన శివమ్ మావి, 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు.

మ్యాచ్ అనంతరం ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘డేల్ స్టెయిన్ నాకు ఐడెల్... చిన్నప్పటి నుంచి ఆయన ఆటను చూస్తూ పెరిగాను. బుమ్రా, భువీలా చేయాలని నేను ప్రయత్నిస్తుంటా కానీ డేల్ స్టెయిన్ మాత్రం నాకు ఫెవరెట్’ అంటూ కామెంట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఉన్న డేల్ స్టెయిన్, శివమ్ మావి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం, నీ మాటలు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. క్రికెట్‌ను నేను ఎప్పుడూ జనాలను ఇంప్రెస్ చేయాలని ఆడలేదు. ఇలా వింటుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. నువ్వు ఇలాంటి పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి రావాలని కోరుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు డేల్ స్టెయిన్.

ఆర్‌సీబీ ప్లేయర్ డేల్ స్టెయిన్, ఈ సీజన్‌లో ఐపీఎల్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పాక్ సూపర్ లీగ్‌లో పాల్గొన్న డేల్ స్టెయిన్, కోట్లు పెట్టి కొనుగోలు చేసే ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్, లంక ప్రీమియర్ లీగుల్లో ఆడినప్పుడే సంతృప్తిగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.