IPL 2020: నిన్న డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌తో ఐపీఎల్ మజాను ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఐపీఎల్ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా టెస్టు మ్యాచ్ చూపించారు చెన్నై బ్యాట్స్‌మెన్. చేతిలో వికెట్లు ఉన్నా, భఆరీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన సీఎస్‌కే సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదుచేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. డుప్లిసిస్ 10 పరుగులు చేయగా షేన్ వాట్సన్ 8, సామ్ కర్రాన్ 22, అంబటి రాయుడు 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జేడజా కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 

ఐదో వికెట్‌కి 51 పరుగులు జోడించిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. రవీంద్ర జడేజా 30 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేయగా కేదార్ జాదవ్ 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో సామ్ కుర్రాన్ కొట్టిన ఒకే ఒక్క సిక్స్ ఉండడం విశేషం.  

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ ఒకటి, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాటియా తలా ఓ వికెట్ తీశారు.