కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న ఛతేశ్వర్ పూజారాకి కానుక ఆస్ట్రేలియా ప్లేయర్లు సంతకాలు చేసిన జెర్సీని కానుకగా అందించిన ప్యాట్ కమ్మిన్స్... 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాని చిత్తు చేసి 2-0 తేడాతో సిరీస్‌ని నిలబెట్టుకుంది టీమిండియా. మిగిలిన రెండు టెస్టుల్లో ఓడినా, టెస్టు సిరీస్‌ని 2-2 డ్రాగా ముగించగలుగుతుంది భారత జట్టు. అయితే తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రలేియా ఆటతీరు చూసిన తర్వాత చివరి రెండు టెస్టుల్లో ఆసీస్‌ గెలవడం కష్టమేనని క్రికెట్ ఫ్యాన్స్‌కి అర్థమైపోయింది..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్ల పాటు టైటిల్‌ని నిలబెట్టుకున్న జట్టుగా టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది... 2017లో స్వదేశంలో ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు, గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించి సిరీస్ గెలిచింది...


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్‌లో బ్రిస్బేన్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడాడు ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్. ఆ మ్యాచ్ సమయంలో అప్పటి టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే, టీమిండియా ప్లేయర్లు సంతకాలు చేసిన జెర్సీని నాథన్ లియాన్‌కి కానుకగా ఇచ్చాడు...

Scroll to load tweet…

రెండేళ్ల తర్వాత ఛతేశ్వర్ పూజారాకి ఇలాంటి కానుకనే తిరిగి ఇచ్చేసింది ఆస్ట్రేలియా. ఢిల్లీ టెస్టు, భారత సీనియర్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారాకి 100వ టెస్టు మ్యాచ్. భారత జట్టు తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన 13వ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా.

ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (200 టెస్టు మ్యాచులు), రాహుల్ ద్రావిడ్ (163), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), వీవీఎస్ లక్ష్మణ్ (113), విరాట్ కోహ్లీ (105*), ఇషాంత్ శర్మ (103), వీరేంద్ర సెహ్వాగ్ (103), హర్భజన్ సింగ్ (103) మాత్రమే టీమిండియా తరుపున 100కి పైగా టెస్టులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు.

రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి, కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయడంతో ఢిల్లీ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత 100వ టెస్టు ఆడుతున్న ఛతేశ్వర్ పూజారాకి జ్ఞాపికగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని అందించాడు ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్..

ఆస్ట్రేలియా అంటే అగ్రెసివ్ ఆటకు కేరాఫ్ అడ్రెస్. ప్రత్యర్థి ఆటగాళ్లకు సెడ్జింగ్ చేస్తూ, అవసరమైతే ఛీటింగ్ చేసి అయినా గెలవాలనేది ఆస్ట్రేలియా సూత్రం. అలాంటి ఆస్ట్రేలియా, ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడికి జ్ఞాపికను అందచేయడం చూసి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆసీస్ చాలా మారిపోయిందని కామెంట్లు పెడుతున్నారు...

కెరీర్‌లో 100వ మైలురాయి టెస్టు ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. దీలిప్ వెంగ్‌సర్కార్ తర్వాత టీమిండియా తరుపు 100వ టెస్టు ఆడుతూ డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు పూజారా. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన పూజారా, విజయానికి 1 పరుగు కావాల్సిన దశలో ఫోర్ బాది విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించాడు..

ఛతేశ్వర్ పూజారాకి టెస్టుల్లో ఇది 58వ విజయం. సచిన్ టెండూల్కర్ మాత్రమే 72 విజయాలతో ఛతేశ్వర్ పూజారా కంటే ముందున్నాడు. విరాట్ కోహ్లీ 57 విజయాలతో పూజారా తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు..