టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తన 31వ పుట్టిన రోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు నాడు తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి ఆయన భూటాన్ వెళ్లారు. అక్కడే ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కాగా...కోహ్లీకి అభిమానులు, సినీ సెలబ్రెటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేశారు.

అలా తెలియజేసిన వారిలో మాజీ క్రికెటర్  యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. అందరిలా కాకుండా యువరాజ్ సింగ్ కాస్త ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. యూవీ చేసిన ట్వీట్ కి కోహ్లీ ఎప్పుడు రిప్లై ఇస్తాడా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.  వారి ఎదరు చూపులకు ప్రతిఫలంగా కోహ్లీ యూవీ పోస్టుకి రిప్లై ఇచ్చారు.

ఇంతకీ యూవీ ఏమని విష్ చేశాడంటే... ‘‘ జీవితంలో ఇది కూడా ఒక రోజు...కానీ అన్ని రోజుల్లా కాదు.. నువ్వు ఎక్కడున్నా...సంతోషంగా ఉండాలి. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ నీతో ఉంటాయి. హ్యాపీ బర్త్ డే కోహ్లీ’’ అంటూ యూవీ ట్వీట్ చేశారు. అంటే... అన్ని రోజులకంటే... పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం అని అర్థం వచ్చేలా యూవీ ట్వీట్ రూపంలో తన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

యూవీ ట్వీట్.. అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంది. దీంతో.. కోహ్లీ రిప్లై కోసం అందరూ ఆసక్తిగా ఎదురు  చూశారు. ‘ పైన ఉన్న దేవుడు ఇప్పటి వరకు అంతా మంచి రోజులే ఇచ్చాడు. లాట్స్ ఆఫ్ లవ్ నీకు కూడా’ అంటూ రిప్లై ఇచ్చాడు.

కాగా... ఈ రిప్లై కూడా అభిమానులను ఆకట్టుకుంది. యూవీ మీద కోహ్లీకి ఎంత గౌరవం ఉందో ఈ ట్వీట్ తో తెలిసిపోతోందంటూ నెటిజన్లు పేర్కొనడం విశేషం.