Asianet News TeluguAsianet News Telugu

ఒకసారి చార్జింగ్ చేస్తే 400కి.మీ ప్రయాణం.. ఇదీ ఆడి ఈ-ట్రాన్ స్పెషాలిటీ

ఆడి ఇండియా ఈ ఏడాది చివరికల్లా భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్న లగ్జరీ విద్యుత్ కారు ‘ఈ-ట్రాన్’ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 400 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. ఫాస్ట్ చార్జింగ్ 40 నిమిషాల్లో పూర్తవుతుంది.

Audi targeting 200+ unit sales of e-tron in India
Author
New Delhi, First Published Jun 30, 2019, 12:17 PM IST

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘ఆడీ ఇండియా’ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును శనివారం భారత్ మార్కెట్ వర్గాలకు పరిచయం చేసింది. మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్న ఈ కారును వచ్చే నెల 12న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అంతకంటే ముందే కారు ప్రివ్యూ నిర్వహించింది ఆడీ. ‘ఇ-ట్రాన్‌’ పేరుతో ఈ కారును మార్కెట్లోకి తీసుకురానున్నారు. 

పరిమాణం పరంగా ఈ-ట్రాన్‌ కారు ఆడి క్యూ5, క్యూ7కు మధ్యస్థంగా ఉండనుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి 125కిలో వాట్లు, మరొకటి 140 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించేలా ఈ కారును రూపొందించారు. సాధారణ ఛార్జింగ్‌ పాయింట్‌లో దాదాపు 8 గంటల పాటు ఛార్జ్‌ చేయాలి. అదే ఫాస్ట్‌ ఛార్జర్‌ అయితే కేవలం 40 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. 

ఈ ఏడాది చివర్లో దీన్ని భారత మార్కెట్లోకి తేనున్నారు. అయితే దీని ధర కూడా దాదాపు రూ. 1.5కోట్ల పైనే ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ధర ఎక్కువైనా ఇ-ట్రాన్‌తో మెర్సిడెస్‌, బీఎండబ్ల్యూ లాంటి కంపెనీలకు ఆడీ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా ఆడీ ఇండియా అధిపతి రాహిత్ అన్సారీ మాట్లాడుతూ ఏటా 200కి పైగా ‘ఈ-ట్రాన్’ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఆడి ఈ ట్రాన్ యూరప్ మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.

వింగ్ మిర్రర్స్ స్థానే కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. మరో గమ్మత్తైన విషయమేమిటంటే ఎటువంటి సుంకాలు లేకుండా ‘ఆడి ఈ-ట్రాన్’ కారు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. సుమారు 2500 ప్యాసింజర్ వెహికల్స్ అలా అనుమతినిస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదండోయ్.. జర్మనీలో కార్లలో అమర్చిన కెమెరాలను కూడా ప్రభుత్వ వర్గాలు ఆమోదిస్తారని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios