కొన్ని బ్యాంకులు ఖాతాల్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ నిబంధనలను మార్చుతూ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏకంగా 50 వేల రూపాయల కనీస బ్యాలెన్స్ ఉండాలని నిబంధన పెడితే,హెచ్‌డిఎఫ్‌సి 25000 కనీస బ్యాలెన్స్ నిర్ధారించింది. ఇజీరో బ్యాలెన్స్ అందించే బ్యాంకుల ఇవిగో. 

బ్యాంకులో ఖాతాదారులకు తమ పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలో షరతును విధిస్తాయి. వాటిని పాటించకపోతే ఆ తర్వాత జరిమానాలు కూడా వసూలు చేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి బ్యాంకు తమకు నచ్చినట్టు వ్యక్తిగత కనీస బ్యాలెన్స్ లో నిర్ణయించుకోవచ్చని తేల్చి చెప్పింది. తాము ఆ విషయంలో జోక్యం చేసుకోమని కూడా చెప్పింది. దీంతో బ్యాంకులు తమకు నచ్చినట్టు కనీస బ్యాలెన్స్ పెంచుకుంటూ పోతున్నాయి.

తాజాగా ఐసిఐసిఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు 50 వేల రూపాయల కనీస బ్యాలెన్స్ ఉండాలని నియమాన్ని మార్చింది. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కూడా పాతికవేల రూపాయలు కనీస బ్యాలెన్స్ ఉండాలని షరతు విధించింది. ఇలాంటి సమయంలో మధ్యతరగతి వారు, పేదవారు బ్యాంకు ఖాతాలను నడుపుకోలేని పరిస్థితి.

బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి వ్యక్తి ఆ బ్యాంక్ నిబంధనల ప్రకారం తమ ఖాతాలో కొంత డబ్బును ఉంచాల్సి వస్తుంది. అది తగ్గిపోతే బ్యాంకులో నిర్వహణ రుసుమును, జరిమానాను విధిస్తాయి. ఆ జరిమానాతో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీస్ వంటి సౌకర్యాలను నిర్వహించడం, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం వంటివి బ్యాంకులు చేస్తూ ఉంటాయి.

ఈ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ జీరో

కనీస బ్యాలెన్స్ నిర్వహించడం భారతదేశంలోని అందరి వల్ల కాదు. పేద, మధ్యతరగతి వ్యక్తులు నెల చివరికి వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ తో ఉంటారు. అలాంటి వారికి HDFC, ICICI బ్యాంకులు పెట్టిన నిబంధనలు పనికిరావు. కాబట్టి వీరు కనీస బ్యాలెన్స్ తక్కువగా ఉండే వాటినే ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ మేము జీరో బ్యాలెన్స్ ను ఒప్పుకునే ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాను ఇచ్చాము. వాటిలో ముఖ్యమైనది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటివి కూడా జీరో బ్యాలెన్స్ ను అనుమతిస్తాయి. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ కనీసం బ్యాలెన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పరిమితి విధించలేదని తెలియజేశారు. కొన్ని బ్యాంకులు పదివేలు= రూపాయలుగా, కొన్ని బ్యాంకులు ఇరవైవేల రూపాయలు పెట్టుకున్నాయని, కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ కూడా ఉంచాలని ఆయన వివరించారు.

పేదవారికి కష్టమే

ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినా ఐసిఐసిఐ ఇకపై వినియోగదారులు తీసుకుని ఖాతాలలో కనీస నిల్వ 50 వేల రూపాయలు ఉండాలని నిబంధన పెట్టింది. మొన్నటి వరకు ఇది పదివేల రూపాయలుగా ఉండేది. కానీ ఆగస్టు నుండి ఆగస్టు ఒకటి నుండి 50 వేల రూపాయలకు మార్చింది. హెచ్డిఎఫ్సి కూడా ఇదే పద్ధతిని అనుసరించి పాతికవేల రూపాయలకు ఫిక్స్ చేసింది. కాబట్టి మధ్య తరగతి వారు, పేదవారు ఆ అకౌంట్లు తీసుకోలేక పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వెళ్ళవచ్చు.

ఈ మూడు బ్యాంకుల్లో నెల చివరకు వచ్చేసరికి ఒక్క రూపాయి లేకున్నా మీకు ఎలాంటి రుసుము వసూలు చేయవు. ఇవి పూర్తిగా పేదవారికి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న బ్యాంకులు. హెచ్డీఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకులు ప్రైవేటు రంగ బ్యాంకులు. అవి తమకు నచ్చినట్టు తమ విధానాలను మార్చుకుంటాయి.