Rupee: భారత కరెన్సీ 'రూపాయి' ఎందుకు అంతగా క్షీణిస్తోంది?
The Rupee Story: భారత కరెన్సీ రూపాయి విలువ మరింతగా పడిపోతూనే ఉంది. గురువారం రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి 9 పాయింట్లు పడిపోయింది. అయితే, అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి క్షీణత అనేక అంశాలతో ప్రభావితమైన సంక్లిష్ట సమస్యగా చెప్పవచ్చు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, భారత ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు, చమురు ధరలు వంటి అంశాలు రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి.
Why is the Indian Currency Depreciating: భారత కరెన్సీ రూపాయి విలువ మరింతగా పడిపోతూనే ఉంది. గురువారం రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి 9 పాయింట్లు పడిపోయింది. అయితే, అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి క్షీణత అనేక అంశాలతో ప్రభావితమైన సంక్లిష్ట సమస్యగా చెప్పవచ్చు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, భారత ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు, చమురు ధరలు వంటి అంశాలు రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకులను చవిచూస్తోంది. అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం ఇటీవల గణనీయమైన దృష్టిని ఆకర్షించిన ఒక కీలకమైన ఆర్థిక అంశం. దీనిపై ఆర్థిక వేత్తలు, మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ పనితీరు వంటి అంశాలతో డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణించడానికి గల కారణాలను గురించి ప్రస్తావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. రూపాయి క్షీణతకు ప్రపంచ ఆర్థిక అంశాలు కూడా ఒక కారణంగా ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, చైనా ఆర్థిక మందగమనం వంటి అంతర్జాతీయ కల్లోలాలు, అనిశ్చితులు ఇన్వెస్టర్లను అమెరికా డాలర్ భద్రత వైపు నడిపించడంతో రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయి.
దేశీయ ద్రవ్యలోటు- పెరుగుతున్న ద్రవ్యోల్బణం
భారత్ లో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం ఇతర కీలక అంశాలు. అధిక ద్రవ్యలోటు అధిక ద్రవ్య సరఫరాకు దారితీస్తుంది. ఇది ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. ఇది రూపాయి విలువను తగ్గిస్తుంది. ఇదే సమయంలో డాలర్ ను ఖరీదైనదిగా మారుస్తుంది. డాలర్ తో రూపాయి క్షీణతకు దారితీస్తుంది.
విదేశీ పెట్టుబడుల ప్రభావం..
రూపాయి విలువను కాపాడటంలో విదేశీ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, అనిశ్చితి సమయాల్లో మాదిరిగానే విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు, ఇది డాలర్ కు అధిక డిమాండ్ కట్టబెడతాయి. దీంతో రూపాయి క్షీణతకు దారితీస్తుంది.
పెరిగిన చమురు ధరలు..
ప్రపంచవ్యాప్తంగా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. చమురు ధరల పెరుగుదల వల్ల భారత్ డాలర్లలో అధిక చెల్లింపులకు దారితీస్తుంది. ఇది డాలర్ కు డిమాండ్ ను పెంచుతుంది, తద్వారా డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణతకు దారితీస్తుంది.
అంటే డాలర్ తో పోలీస్తే రూపాయి విలువ క్షీణించడానికి దేశీయ ఆర్థిక కారణాలతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్ని ఆర్థిక మందగమన పరిస్థితులు కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణత అంతర్జాతీయంగానే కాకుడా దేశీయంగా అనేక అంశాలచే ప్రభావితమవుతుంది. ఆర్థిక వ్యయం వంటి కొన్ని అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో ఉండగా, మరికొన్ని ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు మన నియంత్రణలో లేనివిగా ఉన్నాయి. ఈ కారకాలను అర్థం చేసుకోవడం ద్వారా, మారకం రేటులో కదలికలను అంచనా వేయవచ్చుననీ, ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.