మీ సిబిల్ స్కోర్ ఫ్రీగా చెక్ చేసుకోవాలనుకుంటున్నారా; ఇదిగో బెస్ట్ మార్గం..
క్రెడిట్ స్కోర్‌ను ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు కస్టమర్లు CIBIL స్కోర్‌ను ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఎలాంటి చార్జెస్ చెల్లించకుండానే CIBIL వెబ్‌సైట్‌లో CIBIL స్కోర్‌ని చెక్ చేసుకోవచ్చు.
ఒక వ్యక్తి CIBIL స్కోర్, లేదా క్రెడిట్ స్కోర్ వారి ఆర్థిక లావాదేవీల ప్రతిబింబం. ఇది 300 నుండి 900 వరకు ఉండే మూడు అంకెల నంబర్. మంచి క్రెడిట్ స్కోర్ క్రెడిట్ రిస్క్‌ను తగ్గిస్తుంది. క్రెడిట్ స్కోర్ 900కి దగ్గరగా ఉంటే లోన్స్ ఇతర క్రెడిట్ బెనిఫిట్స్ లభ్యత అంత ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చాల మంచిది. 18 నుండి 36 నెలల వరకు మంచి క్రెడిట్ రీపేమెంట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతాయి. క్రెడిట్ స్కోర్‌ను ఎలా చెక్ చేయాలి?
ఇప్పుడు కస్టమర్లు CIBIL స్కోర్‌ను ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఎలాంటి చార్జెస్ చెల్లించకుండానే CIBIL వెబ్‌సైట్‌లో CIBIL స్కోర్‌ని చెక్ చేసుకోవచ్చు.
CIBIL స్కోర్‌ను ఉచితంగా ఎలా చెక్ చేయాలి
CIBIL స్కోర్‌ను ఉచితంగా చెక్ చేయడానికి www.cibil.com వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో “ఫ్రీ CIBIL స్కోర్ అండ్ గెట్ రిపోర్ట్ ” అప్షన్ పై క్లిక్ చేయండి.
ఇమెయిల్ ఐడి, పేరు, చివరి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
ఐడెంటిటీ నిరూపించడానికి వెరిఫికేషన్ స్టెప్ ఉంటుంది, ఇది సాధారణంగా OTPని ఉపయోగించి చేయబడుతుంది.
వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు మీ క్రెడిట్ రిపోర్ట్ తో పాటు మీ CIBIL స్కోర్‌ను చూడవచ్చు.
ఈ రిపోర్ట్ ఆధారంగా మీరు తగిన లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.