Union Budget 2023: మీరు ఈ యాప్‌లో బడ్జెట్‌ను హిందీ లేదా ఇంగ్లీష్ లో చదవచ్చు.. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

ఏప్రిల్‌ నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. గత రెండు ఎడిషన్‌ల లాగానే ఈ సంవత్సరం కూడా బడ్జెట్ పేపర్‌లెస్ రూపంలో తీసుకురానున్నారు.
 

Union Budget app for Android and iOS will deliver budget 2023 in paperless form: know How it works

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతిసారీ లాగానే బడ్జెట్‌లో ఎలాంటి వస్తువులు ఖరీదైనవిగా మారాయి, ఏ వస్తువులు చౌకగా మారాయి, పన్ను ఎంత పెరిగింది లేదా తగ్గింది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ పనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది వంటి ముఖ్యమైన సమాచారాన్ని బడ్జెట్‌లో తెలపనున్నారు. అందుకే ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు ఎంతో ప్రత్యేకం. వీటన్నింటి మధ్య ప్రభుత్వం ప్రారంభించిన యాప్ ద్వారా మీరు ఈ బడ్జెట్‌ డాక్యుమెంట్స్  చదవవచ్చు ఇంకా బడ్జెట్‌ను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యాప్ ఎలా పని చేస్తుంది, మీరు దీన్ని ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం...

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్
మీ మొబైల్‌లో యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా బడ్జెట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను ప్రభుత్వం గతేడాది ప్రారంభించింది. 

ఏప్రిల్‌ నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి. గత రెండు ఎడిషన్‌ల లాగానే ఈ సంవత్సరం కూడా బడ్జెట్ పేపర్‌లెస్ రూపంలో తీసుకురానున్నారు.

ఆండ్రాయిడ్ ఇంకా ఐఫోన్‌ల కోసం యూనియన్ బడ్జెట్ యాప్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) మార్గదర్శకత్వంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) అభివృద్ధి చేసింది. 

కేంద్ర బడ్జెట్ యాప్ ఆర్థిక మంత్రి ప్రజెంటేషన్ ఇంకా ప్రసంగం పూర్తయిన తర్వాత ఆన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ (బడ్జెట్ అని కూడా పిలుస్తారు), డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్స్ బిల్లు అలాగే మరిన్నింటితో సహా మొత్తం 14 బడ్జెట్ డాక్యుమెంట్స్ పబ్లిష్ చేస్తుంది.

ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 
మీరు కూడా ఈ యాప్ ద్వారా బడ్జెట్ తెలుసుకోవాలనుకుంటే లేదా చదవాలనుకుంటే  మీరు ఈ యాప్‌ని http://indiabudget.gov.in లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అఫిషియల్ యూనియన్ బడ్జెట్ వెబ్‌సైట్ నేరుగా డౌన్‌లోడ్ లింక్‌లను అందజేస్తున్నప్పటికీ, యూనియన్ బడ్జెట్ యాప్ ని Apple App Store ఇంకా Google Playలో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీరు రెండు భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు
నిజానికి, మీరు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌ను సులభంగా చదవవచ్చు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే, మీరు ఈ యాప్‌లో మీకు నచ్చిన హిందీ ఇంగ్లిష్ భాషలో చూడవచ్చు ఇంకా చదవవచ్చు.

ప్రత్యక్ష ప్రసారం   
ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. మీరు ఈ ప్రత్యక్ష ప్రసారం పార్లమెంట్ టీవీ ఇంకా దూరదర్శన్‌లో చూడవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios