Union Budget 2023: బడ్జెట్లో పీఎం కిసాన్ కింద రైతులకు ప్రతి ఏటా రూ. 8000 ఇచ్చే అవకాశం..రైతులకు బంపర్ గిఫ్ట్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ మోడీ ప్రభుత్వం రెండో పర్యాయం పూర్తి చేసుకునే ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కానుంది. అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ పై రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధిలో , కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు అందిస్తుంది అయితే ఈ మొత్తం. 8000 వేలకు పెంచవచ్చని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూత్రప్రాయంగా సూచిస్తున్నారు. రైతులకు ఇచ్చే ఈ నిధిని ఏటా రూ.2000 పెంచితే ప్రభుత్వం రూ.22 వేల కోట్లు అదనంగా ఖర్చు రానుంది.
గత ఏడాది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది.వరి, గోధుమల సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు పెద్దపీట వేశారు. ఈ సెషన్‌లో 163 లక్షల మంది రైతుల నుంచి 1208 మెట్రిక్ టన్నుల గోధుమలు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 2.37 లక్షల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు MSP ద్వారా ప్రకటించారు.
గత రెండేళ్లుగా రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో గత బడ్జెట్ లో రైతులను డిజిటల్, హైటెక్‌గా మార్చేందుకు మోడీ ప్రభుత్వం పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. రైతులకు డిజిటల్, హైటెక్ సేవలను అందించేందుకు పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, విలువ జోడింపు, నిర్వహణపై దృష్టి సారించారు. సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును ప్రకటించారు. 44,000 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల 900,000 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
అలాగే గత బడ్జెట్ లో వ్యవసాయ రంగంలో సుస్థిర వ్యవసాయం కోసం డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంట అంచనా, భూ రికార్డులు, పురుగుమందుల పిచికారీ కోసం రైతు డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా సాంకేతిక రంగాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసింది మోదీ ప్రభుత్వం. నాబార్డు ద్వారా రైతులకు నిధుల సౌకర్యం. స్టార్టప్ ఎఫ్‌పిఓలకు మద్దతు ఇవ్వడం ద్వారా రైతులను హైటెక్‌గా మార్చడం, రసాయన రహిత సహజ వ్యవసాయం వంటి విషయాలను దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంగా ప్రచారం చేస్తున్నారు.