Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2023: రేపే పార్లమెంటులో ఆర్థిక సర్వే సమర్పణ, ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ ఎక్కడ చూడాలో తెలుసుకోండి..

కేంద్ర బడ్జెట్ 2023కు సంబంధించిన కీలకమైన ఆర్థిక సర్వే రేపు సమర్పించనున్నారు. దీనికి సంబంధించిన  ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలో తెలుసుకుందాం. 

Union Budget 2023: Know where to watch Economic Survey presentation, press conference live in Parliament tomorrow MKA
Author
First Published Jan 30, 2023, 4:17 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ 2023ని ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ రోజున, ఆర్థిక మంత్రి పార్లమెంటు భవనంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధాన ఆర్థిక ప్రణాళికలను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ఒకరోజు ముందు అంటే జనవరి 31న ప్రభుత్వం ఆర్థిక సర్వేను అంకితం చేస్తారు. ఇందులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏమిటి, దేశం ఏ వేగంతో ముందుకు సాగుతోంది, ఏ రంగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, భవిష్యత్తు అవసరాలు ఏమిటి. అనే అంశాలపై నివేదిక ప్రకటిస్తారు.  ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) పర్యవేక్షణలో ఆర్థిక సర్వే రూపొందించబడనుంది.  వి అనంత్ నాగేశ్వరన్ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA)గా ఉన్నారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ టెలికాస్ట్ ఎక్కడ చూడవచ్చో తెలుసా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో సీఈవో నాగేశ్వరన్ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు. దీంతో పాటు ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్ స్ట్రీమింగ్ ను సోషల్ మీడియాలో చూడవచ్చు. ఇది కాకుండా, ప్రజలు దీనిని PIB ఇండియా YouTube ఛానెల్‌లో కూడా చూడవచ్చు. ఈ నివేదికను వివరంగా అర్థం చేసుకోవాలనుకునే ఎవరైనా దీన్ని అధికారిక వెబ్‌సైట్ (www.indiabudget.gov.in/econicsurvey) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి NDA మిత్రులందరికీ ఆహ్వానాలు పంపారు. ప్రతి పార్లమెంటు సమావేశానికి ముందు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తారు.  ఈ సమావేశం ద్వారా ప్రతిపక్షాలు తాము చర్చించదలిచిన అంశాలను ప్రస్తావిస్తాయి.

కరోనా మహమ్మారి తర్వాత, భారతదేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది, కానీ ప్రపంచ మాంద్యం ప్రమాదం ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. అయినప్పటికీ రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది, అయితే ఇప్పటికీ చాలా మంది ప్రజలు దేశంలో ఆర్థిక మాంద్యం అవకాశాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రభుత్వ బడ్జెట్ సామాన్య ప్రజలకు అత్యంత కీలకంగా మారనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios