Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2023: బడ్జెట్ రూపకల్పనలో ఈ ఆరుగురు.. ఆర్ధిక మంత్రి స్పీచ్ నుండి వీరి గురించి తెలుసుకోండి..

కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కోలుకుంటున్నందున ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రకటన కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బ్యూరోక్రాట్లు ఇంకా సలహాదారుల సహాయంతో ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తారు.

Union Budget 2023-24 : Meet the team that has curated your financial future  on whom the Finance Minister has faith
Author
First Published Jan 30, 2023, 5:03 PM IST

ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ 2022 భారతదేశానికి మెరుగైన సంవత్సరం. అయితే 2023లో ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో ఈ బడ్జెట్ చాలా కీలకం కానుంది. బడ్జెట్ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అలాగే కేంద్ర ఆర్థిక మంత్రికి పూర్తి నమ్మకం ఉన్న ఆరుగురి గురించి  తెలుసుకుందాం...

వి.అనంత్ నాగేశ్వరన్ - చీఫ్ ఎకనామిక్ అడ్వైసర్
వి.అనంత్ నాగేశ్వరన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారి (CEA)గా జనవరి 28, 2022న నియమితులయ్యారు.

నిర్మలా సీతారామన్‌కు అత్యంత విశ్వసనీయ సలహాదారి. బడ్జెట్ ప్రసంగానికి అవసరమైన ఇన్‌పుట్‌లను అందించడం అతని బాధ్యత. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేసిన నాగేశ్వరన్ కూడా ఆర్థిక సర్వేను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. 

టివి సోమనాథన్- ఆర్థిక శాఖ కార్యదర్శి
ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ అధికారి. టివి సోమనాథన్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. అతను ఏప్రిల్ 2015 నుండి ఆగస్టు 2017 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేశాడు.

టివి సోమనాథన్ 80కి పైగా పేపర్‌లను ప్రచురించాడు. ఆర్థిక శాస్త్రం ఇంకా ఫైనాన్స్‌పై రెండు పుస్తకాలకు రచయిత కూడా. ఇంకా ప్రపంచ బ్యాంకు బడ్జెట్ పాలసీ గ్రూప్‌కు మేనేజర్‌గా కూడా నియమితుడయ్యాడు.

వివేక్ జోషి -సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వివేక్ జోషి, హర్యానా కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ IAS అధికారి, జెనీవా విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందారు. ఆర్థిక సేవల విభాగం బాధ్యతలను స్వీకరించడానికి ముందు అతను సెన్సస్ కమిషనర్‌గా పనిచేశాడు. రెండు ప్రభుత్వ బ్యాంకులు ఇంకా ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించే బాధ్యత అతని భుజాలపై ఉంది.

సంజయ్ మల్హోత్రా, రెవెన్యూ శాఖ కార్యదర్శి
సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో జూనియర్ అధికారి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని 'బి' భాగాన్ని సిద్ధం చేయడంలో కూడా సహాయపడతారు.

రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి, సంజయ్ మల్హోత్రా రెవెన్యూ కార్యదర్శిగా నియమితులు కాకముందు REC లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. IIT కాన్పూర్ నుండి గ్రాడ్యుయేట్ ఇంకా ప్రిన్స్టన్ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్  డిగ్రీ పొందాడు. సంజయ్ మల్హోత్రా ఫైనాన్స్ అండ్ టాక్సేషన్, పవర్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి వివిధ రంగాలలో పనిచేశారు.

అజయ్ సేథ్- ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
అజయ్ సేథ్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఏప్రిల్ 2021లో ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ కాకముందు బెంగుళూరు మెట్రో ఎండీగా ఉన్నారు. దేశంలో మొట్టమొదటి సావరిన్ గ్రీన్ బాండ్‌ను ప్రవేశపెట్టిన అజయ్ సేథ్, G-20 ఆర్థిక విభాగానికి హెడ్ కూడా. పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని అజయ్ సేథ్ సిద్ధం చేస్తారు.

 ఇతనికి పబ్లిక్ ఫైనాన్స్ అండ్ సోషల్ సెక్టార్‌లో 33 సంవత్సరాల అనుభవం ఉంది. కర్ణాటక ప్రభుత్వంలో ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ అదనపు ప్రధాన కార్యదర్శి ఇంకా వాణిజ్య పన్నుల కమిషనర్ వంటి అనేక పదవులలో చేశారు. 2013లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు పీఎం అవార్డు గ్రహీత కూడా.

తుహిన్ కాంత్ పాండే- కార్యదర్శి,  DIPAM 
 తుహిన్ కాంత్ పాండే ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ IAS అధికారి. పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, పబ్లిక్ ఫైనాన్స్ రంగాలలో తుహిన్ కాంత్ పాండేకు అపారమైన అనుభవం ఉంది. 2009లో ఐదేళ్లపాటు ప్లానింగ్ కమిషన్ లో  జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు, ఆ తర్వాత రెండేళ్లపాటు క్యాబినెట్ సెక్రటేరియట్‌లో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

 వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, భారత్ ఎర్త్ మూవర్స్ ఇంకా NMDC ప్రైవేటీకరణపై పాండే దృష్టి సారిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios