Asianet News TeluguAsianet News Telugu

Today Gold And Silver Prices: ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. అదే బాట‌లో సిల్వ‌ర్‌..!

గత కొన్ని రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతోంది. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కేవలం పది రోజుల్లోనే బంగారం ధర రూ.1000పైగా పెరిగింది. ఇప్పుడు బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Today Gold And Silver Prices
Author
Hyderabad, First Published Jan 22, 2022, 9:54 AM IST

గత కొన్ని రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతోంది. బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. కేవలం పది రోజుల్లోనే బంగారం ధర రూ.1000పైగా పెరిగింది. ఇప్పుడు బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీరేట్లు, దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనం అవుతున్న కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు రావడంతో మళ్లీ బంగారానికి డిమాండ్‌ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. మున్ముందు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం వల్ల బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బంగారం ధరల్లో గత కొద్దిరోజులుగా పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కరోనా మహమ్మారి, వివిద దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, మార్కెట్ తీరు వంటి వాటి ప్రభావం బంగారం ధరలపై కచ్చితంగా ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతుంది. 

వెండి ధ‌ర‌లు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 65,400లుగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,400 లుగా ఉంది. చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 69,300లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర 65,400 లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది. కేరళలో కిలో వెండి ధర 69,300 లుగా కొనసాగుతోంది. ఇక‌పోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 69,300గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతుంది. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios