పెట్రోల్ డీజిల్ ధరలు సోమవారం కూడా స్థిరంగానే ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు లేవు, సోమవారం హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేసుకోండి..

Petrol Diesel price in Hyderabad: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా అంటే సోమవారం కూడా స్థిరంగానే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర109.66 రూపాయలుగా ఉంది. ఒక లీటర్ డీజిల్ ధర రూ. 97.82 గా ఉంది. 

చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ , డీజిల్ ధరలను సమీక్షించి, ఆ తర్వాత ప్రకటిస్తాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరల రోజువారీ ధరల సమీక్ష అంతర్జాతీయ మార్కెట్‌లో మునుపటి 15 రోజులలో క్రూడ్ ఆయిల్ ధర, విదేశీ మారకపు రేట్ల ఆధారంగా ఉంటాయి.

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ముడి చమురు ధరపై ఆధారపడి ఉంటాయి. అయితే, ముడిచమురు ధరల్లో మార్పు వచ్చిన తర్వాత కూడా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత ఏడాది మే 22 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఫిబ్రవరి 20న, దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో పెట్రోల్ మరియు డీజిల్ తాజా ధరలను అప్‌డేట్ చేయగా, నేడు కూడా ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా గమనించినట్లయితే క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడి ఉంటాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గుతూ వస్తోంది అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. . అయితే భారత దేశంలో పెట్రోల్ డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పన్నులు విధిస్తాయి దీంతో పెట్రోల్ ధర దాదాపు మూడు అంకెలు దాటుతోంది. దేశవ్యాప్తంగా గమనించినట్లయితే అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు ప్లేయర్లో పెట్రోల్ ధర చాలా తక్కువ లభిస్తుంది ఇక్కడ పెట్రోల్ ధర ఒక లీటర్ కు గాను రూ. 90 మాత్రమే పలుకుతోంది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు.

అయితే అతి త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు ఒకవేళ ఇదే గనుక జరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా వంద రూపాయల కన్నా దిగువకు వచ్చే అవకాశం ఉంది.