బంగారం ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గరిష్ట స్థాయి నుంచి ఏకంగా రూ. 2000 తగ్గి రూ.56 వేల దిగువకు పడిపోయింది. దీంతో పసిడి ఆభరణాల కొనుగోలుదారులకు శుభవార్త విన్నట్లు అయ్యింది.
బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. శుక్రవారం బంగారం ధరలు రూ.56,000 దిగువకు చేరుకున్నాయి. అంతకుముందు గురువారం బంగారం ధరలు ఒక నెల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,235 వద్ద ముగిసింది. ఇది శుక్రవారం గ్రాముకు రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకుంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులే ధరల పతనానికి ప్రధాన కారణం.
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి
ఢిల్లీలో స్పాట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.285 తగ్గి రూ.55,950కి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థాయిలో డిమాండ్ బలహీనంగా ఉండటమే. బంగారం ధర తగ్గడం వెండి ధరలో కూడా కనిపించింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.620 తగ్గి రూ.65,005కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1,821 డాలర్లు, వెండి ఔన్స్‌కు 21.29 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ క్షీణతకు కారణం అంచనాల కంటే మెరుగైన US ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యల కారణంగా బంగారం ధరలు క్షీణించినట్లు నిపుణులు చెబుతున్నారు.
జ్యువెలరీ నిపుణురాలు కోలిన్ షా ప్రకారం, బంగారం ధర తక్షణమే తగ్గడానికి కారణం అమెరికా ఆర్థిక గణాంకాలే. ద్రవ్యోల్బణం PPI ప్రధాన సూచిక జనవరిలో పెరుగుదలను చూసింది. ఇది ఫెడ్ రిజర్వ్ యొక్క ఆందోళనలను పెంచింది. అటువంటి పరిస్థితిలో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
ఇది కాకుండా, ఆర్థిక డేటా కారణంగా, డాలర్ ఇండెక్స్ లో డాలర్ 104 స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనడం ఖరీదైంది. బలమైన డాలర్, పెరుగుతున్న వడ్డీ రేట్లు బంగారాన్ని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని తగ్గిస్తాయి. అయితే, వచ్చే ఏడాది దృష్టితో చూస్తే, ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు చెబతున్నారు.
అంతర్జాతీయంగా ప్రస్తుతం డాలర్ బలంగా ఉండటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అవుతున్నాయి ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ. 55,000 దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు కానీ అంతర్జాతీయంగా పరిస్థితిలో చాలా అనుస్థితిగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బంగారం మార్కెట్లో ఏదైనా జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుగోలు చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో కొనడం అసాధ్యం అవుతుందని చెబుతున్నారు.
