ఆఫీసుకు రమ్మని ఉద్యోగులపై ఒత్తిడి చేయడం లేదని TCS ప్రకటన..ఆరోపణలు నిరాధారమని ఖండన..

దేశంలోనే ప్రముఖ ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీని పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది అంతేకాదు ఇది కేవలం నిరాధారమైన ఆరోపణలని తమ సంస్థ ఉద్యోగులకు  ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ప్రకటించింది. 

TCS statement that there is no pressure on employees to come to work from office..The allegations are baseless MKA

ప్రముఖ ఐటీ కంపెనీ టిసిఎస్ లో ఆఫీసుకు రాని ఉద్యోగులకు కఠినమైన హెచ్చరికలు పంపినట్లు వస్తున్న వార్తలు  కలకలం సృష్టిస్తున్నాయి.  దీంతో వర్క్ ఫ్రం హోం కల్చర్ అతి త్వరలోనే ముగిసిపోయే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.  కానీ సంస్థ మాత్రం తాము ఉద్యోగులను ఏ విధమైన ఒత్తిడికి గురి చేయడం లేదని,  బయట ప్రచారం అవుతున్న  వార్తలు కేవలం నిరాధారం అని కొట్టిపారేసింది. 

ఆఫీస్ కు తిరిగి రావాలనే పాలసీని పాటించని ఉద్యోగులకు కఠినమైన హెచ్చరికలు పంపినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ఒక ప్రకటనలో, TCS ప్రతినిధి తెలిపారు. దీనిపై మరిన్ని విషయాలు మాట్లాడుతూ, కంపెనీ ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయమని కంపెనీ ప్రోత్సహిస్తోందని తెలిపారు. తమ సంస్థ ఉద్యోగులను ఏ తరహాలోను హెచ్చరించలేదని,  కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో  సంరక్షించుకుంటుందని తెలిపారు. 

ఒక నెలలో ఆఫీసు నుండి కనీసం 12 రోజుల పనిని పూర్తి చేయని ఉద్యోగులకు TCS మెమోలు పంపడం ప్రారంభించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంపై స్పందనగా  టి సి ఎస్ ఈ ప్రకటన విడుదల చేసింది .ఉద్యోగులు కంపెనీ నియమావళికి కట్టుబడి ఉండకపోతే వారిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించినట్లు,  టైమ్స్ అఫ్ ఇండియా  ఓ వార్తను ప్రచురించింది.  దీంతో టిసిఎస్ కంపెనీలో ఉద్యోగులపై ఒత్తిడి కొనసాగుతోందనే  వార్తలు మార్కెట్లో సంచలనంగా నిలిచాయి.  

అయితే ఈ వార్తలు ఖండిస్తూ టిసిఎస్ ప్రకటనలో "తమ క్యాంపస్‌లు నూతన శక్తితో సందడి చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము, మా ఉద్యోగులందరూ ఈ శక్తివంతమైన  ఎకో సిస్టం భాగం కావాలని కోరుకుంటున్నాము. గత రెండేళ్లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులు TCSలో చేరారు. TCS వాతావరణాన్ని అనుభవించడం వారికి చాలా ముఖ్యం.  పరస్పర సహకారం. నేర్చుకోవడం, ఎదగడం, కలిసి ఆనందించడం అనేది తమ సంస్థ మూల సూత్రం అని తెలిపింది. , తద్వారా సంస్థ  పురోభివృద్ధికి దిశగా అడుగులు వేస్తుందని తన ప్రకటనలో తెలిపింది. 

"గత కొన్ని నెలలుగా మేము భారతదేశంలోని అసోసియేట్‌లను కార్యాలయానికి తిరిగి రావాలని వారానికి 3 రోజులు ఆఫీసులో గడపాలని ప్రోత్సహిస్తున్నాము. ఇందులో భాగంగా చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మంచి ఫలితాలను అందించింది. సహచరులు అంతా కలిసి పని చేయడమే మా లక్ష్యం. నెలలో సగటున 12 రోజులు వారానికి కనీసం 3 రోజులు కార్యాలయంలో పనిచేయాలని మేము ప్రోత్సహిస్తున్నాము అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

ఉద్యోగులను 100 శాతం  వర్క్ ఫ్రం హోం పద్ధతిలో రిమోట్‌గా పని చేయడానికి అనుమతించబోమని TCS గత సంవత్సరం చెప్పింది. వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని ఉద్యోగులకు ఈమెయిల్స్ కూడా పంపింది. TCS మోడల్ ప్రకారం ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసుకు పిలుస్తుంది, TCS ఉద్యోగులలో 25 శాతానికి మించకుండా ఒక నిర్దిష్ట సమయంలో కార్యాలయం నుండి పని చేయవలసి ఉంటుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios