Asianet News TeluguAsianet News Telugu

టాటా సన్స్, సైరస్‌ మిస్త్రీ వివాదంపై సుప్రీం కోర్ట్ తీర్పు.. వాదనలు రాతపూర్వకంగా సమర్పించాలంటు ఆదేశాలు..

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచారణ సందర్భంగా 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అని షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పి) గ్రూప్ పేర్కొంది.
 

Tata sons vs Mistry case: Supreme Court reserves verdict and asks all parties to file written submissions in a week
Author
Hyderabad, First Published Dec 18, 2020, 2:15 PM IST

న్యూ ఢీల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ లిమిటెడ్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్స్ సైరస్ మిస్త్రీ మధ్య ముదిరిన కేసులో సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వు చేసింది. రెండు గ్రూపులూ తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలనీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచారణ సందర్భంగా 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించడంలో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, కంపెనీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అని షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పి) గ్రూప్ పేర్కొంది.

టాటా గ్రూప్ ఈ ఆరోపణలను ఖండింస్తు, మిస్త్రీ తొలగింపులో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ఉత్తర్వులను నిలిపివేసి టాటా గ్రూపుకు సుప్రీం కోర్టు జనవరి 10న ఉపశమనం ఇచ్చింది.

మిస్త్రీ 2012లో టాటా సన్స్ ఛైర్మన్‌ రతన్ టాటా తరువాత పదవిలోకి వచ్చార, కాని నాలుగు సంవత్సరాల తరువాత అక్టోబర్ 24, 2016న తొలగించారు.  ఈ కేసులో  సైరస్‌ను తిరిగి నియమిస్తూ, 2019 డిసెంబర్‌ 18న ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు ఇచ్చింది. అయితే 100 బిలియన్‌ డాలర్ల విలువైన గ్రూప్‌ పాలనా అంశాలకు సంబంధించి తగిన ఆదేశాలు రాలేదని, ట్రిబ్యునల్‌ ఆదేశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంటూ  మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
    
సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన క్రాస్ అప్పీల్‌పై టాటా సన్స్, ఇతరులకు మే 29న ఉన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఇది 'రెండు గ్రూపుల సంస్థ' కాదని, దీనికి సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య 'పాక్షిక భాగస్వామ్యం' లేదని టాటా సన్స్ గతంలో ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.

also read కోకాకోలాలో ఉద్యోగాల కోత..అమెరికాతో సహ ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఇంటికి.. ...

టాటా సన్స్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖలు చేసిన క్రాస్ అప్పీల్‌పై స్పందిస్తూ, తన కుటుంబం వద్ద ఉన్న వాటాకు టిఎస్‌పిఎల్ బోర్డులో ప్రాతినిధ్యం పొందాలని ఎన్‌సిఎల్‌ఎటి ఉత్తర్వుల్లో ఆరోపించిన వైరుధ్యాలను తొలగించాలని కోరింది. .

టాటా గ్రూప్ 2019లో రూ.13వేల కోట్ల నికర నష్టాన్ని చేసిందని, ఇది గత మూడు దశాబ్దాలలో జరిగిన ఘోరమైన నష్టమని మిస్త్రీ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు సైరస్‌ మిస్త్రీ పునఃనియామకాన్ని సవాలుచేస్తూ,  టాటా సన్స్‌ కూడా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లింది. తద్వారా రెండు గ్రూప్‌లూ వివాదంపై క్రాస్‌ అప్పీల్స్‌ దాఖలు చేసినట్లయ్యింది.

 టాటా సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఎస్‌పీఎల్‌)లో తమకున్న షేర్లను తనఖా పెట్టడంకానీ లేదా బదలాయించడంగానీ చేయరాదని కూడా ఎస్‌పీ గ్రూప్, సైరస్‌ మిస్త్రీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 

టాటా సన్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ వాటా 18.37 శాతం విలువ ప్రస్తుతం రెండు గ్రూప్‌ల మధ్య న్యాయపోరాటానికి వేదికగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టుకు  షాపూర్‌జీ పలోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ అప్పటికే సమర్పించింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు అక్టోబర్‌ 29న  సంబంధిత వర్గాలు తెలిపాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios