టాటా సన్స్ లిమిటెడ్‌లో వాటాలను మార్చుకోవటానికి సైరస్ మిస్త్రీ కుటుంబం ఇచ్చిన ప్రతిపాదనను టాటా గ్రూప్ తిరస్కరించింది, విభజన ప్రణాళికను అర్ధంలేనిదిగా పేర్కొంది. వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి.  

“ఇది అర్ధంలేనిది. నేను దీనిని వ్యతిరేకిస్తున్నాను ”అని టాటా సన్స్ న్యాయవాది హరీష్ సాల్వే గురువారం సుప్రీంకోర్టు ముందు విచారణ సందర్భంగా అన్నారు.

 హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్‌పీ గ్రూప్‌ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్‌ తోసిపుచ్చింది.

also read తాతయ్య అయిన ముకేష్ అంబానీ.. సోషల్ మీడియాలో మనవడితో ఫోటో వైరల్.. ...

అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్‌ కంపెనీల్లో ఎస్‌పీ గ్రూప్‌ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ హరీష్‌ సాల్వే, ఎస్‌పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ సీఏ సుందరం వాదనలు వినిపించారు.

టాటా సన్స్‌తో విభేదాల కారణంగా అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్‌పీ గ్రూప్‌ భావిస్తోంది.  ఎస్‌పీ గ్రూప్ వాటాను 1.75 ట్రిలియన్లుగా అంచనా వేసింది, అయితే టాటా గ్రూప్ దాని విలువ సగం కంటే తక్కువగా 80వేల కోట్ల రూపాయలు అని తెలిపింది. 

టాటా గ్రూప్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని బహిష్కరించడంతో ప్రారంభమైన న్యాయ పోరాటం, గతనెల సెప్టెంబరులో సైరస్ మిస్త్రీ కుటుంబం టాటా గ్రూపుతో ఉన్న సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకుంది.