సీక్రెట్ సాటిలైట్ సక్సెస్.. ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడికి సైన్యాన్ని సిద్ధం చేయవచ్చు..

తంలో కూడా రెండు గూఢచారి(spy) ఉపగ్రహ ప్రయోగాలు విఫలమయ్యాయి. కిమ్ గురువారం శాస్త్రవేత్తలు ఇంకా టెక్నాలజీ నిపుణులను స్వాగతించినట్లు అధికారిక వార్తా సంస్థ KCNA తెలియజేసింది. 

Spy satellite launch successful, Kim welcomes scientists with daughter and wife-sak

 సీక్రెట్(spy) సాటిలైట్ ప్రయోగంపై శాస్త్రవేత్తలను ఉత్తర కొరియా అధ్యక్షుడు  కిమ్ జోంగ్ ఉన్ అభినందించారు. సాటిలైట్ ప్రయోగాన్ని స్పెస్ అడ్వాన్స్మెంట్ కొత్త శకంగా కిమ్ అభివర్ణించారు. ఈ ప్రయోగం తర్వాత కిమ్ స్పందించిన తీరు డిఫెన్స్ ట్రైనింగ్ లో ఒక మైలురాయి. ఉత్తర కొరియా మంగళవారం గూఢచారి ఉపగ్రహాన్ని(Spy satellite) ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఉత్తర కొరియా పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కొరియా పరిశీలన ఏమిటంటే, మిషన్ విజయవంతమైందని ప్రకటించలేదు.

గతంలో కూడా రెండు గూఢచారి(spy) ఉపగ్రహ ప్రయోగాలు విఫలమయ్యాయి. కిమ్ గురువారం శాస్త్రవేత్తలు ఇంకా టెక్నాలజీ నిపుణులను స్వాగతించినట్లు అధికారిక వార్తా సంస్థ KCNA తెలియజేసింది. రిసెప్షన్‌కు కిమ్‌తో పాటు అతని భార్య రి సోల్ జు, కూతురు కిమ్ జు ఏ కూడా వచ్చినట్లు సమాచారం. ఈ  సీక్రెట్(spy) సాటిలైట్ రక్షణ కార్యకలాపాలకు శక్తినిస్తుందని కిమ్ అంచనా. ఉత్తర కొరియా అధినేత కిమ్ టోక్ హున్ మాట్లాడుతూ.. శాటిలైట్ల సాయంతో ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడికి సైన్యాన్ని సిద్ధం చేయవచ్చు అని అన్నారు. 

ఉత్తర కొరియా ఐదేళ్ల సైనిక ప్రణాళికలో గూఢచారి ఉపగ్రహ విస్తరణ కీలకమైన అంశం. కొరియా ద్విపం( Korean Peninsula)  అమెరికా, దక్షిణ కొరియాల కదలికలను తెలుసుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపకరిస్తుందని ఉత్తర కొరియా అభిప్రాయపడింది. సాటిలైట్ ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత, గ్వామ్‌లోని US సైనిక స్థావరం చిత్రాలను సమీక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా, జపాన్‌, ఐక్యరాజ్యసమితితో పాటు ఉత్తర కొరియా ఖండించింది. గూఢచారి ఉపగ్రహ ప్రయోగం ఉత్తర కొరియా రష్యా నుండి సహాయం పొందిందన్న దక్షిణ కొరియా ఆరోపణలకు ఆజ్యం పోసింది.

సెప్టెంబర్‌లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్  రష్యాలో పర్యటించారు. ఈ పర్యటనలో, పుతిన్ ఉత్తర కొరియాకు ఉపగ్రహాల నిర్మాణంలో సహాయం అందించారు. మూడో ప్రయత్నంలో Maligyong 1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. అంతకుముందు మే, ఆగస్టు నెలల్లో గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించడంలో ఉత్తర కొరియా విఫలమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios