Asianet News TeluguAsianet News Telugu

Closing Bell: మార్కెట్లను పట్టి పీడిస్తున్న గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం, 360 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

సోమవారం స్టాక్ మార్కెట్ కీలక సూచీలు నష్టాల్లో ముగిశాయి.  సెన్సెక్స్ 360.95 పాయింట్లు క్షీణించి 57,628.95 వద్ద, నిఫ్టీ 111.60 పాయింట్లు క్షీణించి 16,988.40 వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోయింది. కానీ చివరి రెండు గంటల్లో జరిగిన కొనుగోళ్లు సెన్సెక్స్ డే కనిష్ట స్థాయి 57,084.91 పాయింట్లు, నిఫ్టీ  16,828.35 నుండి కోలుకోవడం విశేషం. 

Sensex sinks 360 points Bank Nifty falls below 39400 Nifty settles below 17000 MKA
Author
First Published Mar 20, 2023, 4:06 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇంట్రాడేలో భారీ నష్టాల నుంచి కొంత రికవరీ అయినప్పటికీ, మార్కెట్ ముగిసే సమయానికి మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ సూచీ 111.65 పాయింట్లు క్షీణించి 16,988.40 వద్ద ముగియగా, BSE సెన్సెక్స్ 360.95 పాయింట్లు నష్టపోయి 57,628.95 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 236.15 పాయింట్లు నష్టపోయి 39,361 పాయింట్ల వద్ద ముగిసింది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, బీపీసీఎల్, ఐటీసీ, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదే సమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా స్టీల్ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.

సోమవారం మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచే బలమైన అమ్మకాలు కనిపించాయి.  సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలలో భారీ క్షీణత నమోదైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ కూడా 16900 దిగువకు చేరుకుంది. నిఫ్టీలో బ్యాంక్, ఐటీ, మెటల్, ఆటో ఇండెక్స్ 1 నుంచి 2 శాతం క్షీణించాయి. హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపించాయి. గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభం ప్రభావంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజీ (బిఎస్‌ఇ)లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు 3.5 లక్షల కోట్లు తగ్గింది.

మార్చి 17న మార్కెట్ ముగిసే సమయానికి, బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,57,52,917.56 కోట్లుగా ఉంది, ఇది మార్చి 20న అంటే ఈరోజు మధ్యాహ్నం 1:40 గంటల వరకు రూ.2,54,12,562.75 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు దాదాపు 3.5 లక్షల కోట్లు తగ్గింది. సూచీలను ప్రభావితం చేసే హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు జరిగాయి.

ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం
సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ బ్యాంకును స్విస్ బ్యాంకు  కొనుగోలు చేసి, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారులు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థపై ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాన్ని నివారించే లక్ష్యంతో, ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థ UBS స్విస్ బ్యాంక్, ప్రస్తుతం సమస్యల్లో ఉన్న  బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌ను సుమారు  3.25 బిలియన్ డాలర్లో కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. 

Credit Suisse తన షేర్లు పడిపోయిన తర్వాత స్విస్ సెంట్రల్ బ్యాంక్ (సెంట్రల్ బ్యాంక్) నుండి  54 బిలియన్ డాలర్ల వరకు రుణం తీసుకోనున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, ఇది కూడా బ్యాంకు ఖాతాదారులకు, పెట్టుబడిదారులకు  ఈ వార్త భరోసా ఇవ్వలేదు, ఆ తర్వాత స్విస్ అధికారులు సమస్యాత్మక బ్యాంకును స్వాధీనం చేసుకోవాలని UBSని అభ్యర్థించారు. అంతర్జాతీయ ఆర్థిక రంగం స్థిరత్వానికి ఈ ఒప్పందం పెద్ద ముందడుగు అని స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బార్సెట్ అన్నారు.

మార్కెట్ పతనానికి ఇతర కారణాలు
>> ఈరోజు అదానీ 10 షేర్లలో 8 షేర్లపై ఒత్తిడి కనిపిస్తోంది. ముంద్రాలోని రూ. 34,000 కోట్ల పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) ప్లాంట్ పనులను నిరవధికంగా నిలిపివేసింది. ఇది సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

>> మరోవైపు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) శుక్రవారం అంటే మార్చి 17న స్టాక్ మార్కెట్ నుంచి భారీగా డబ్బు ఉపసంహరించుకున్నారు. NSEలో అందుబాటులో ఉన్న తాత్కాలిక డేటా ప్రకారం, FII మార్చి 17న మార్కెట్ నుండి రూ.1766.53 కోట్లను ఉపసంహరించుకుంది.

>>  నేటి వ్యాపారంలో, ప్రధాన ఆసియా మార్కెట్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. 

>>  మార్చిలో US ఫెడ్ పాలసీలో మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios