Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీయేకి మద్దతుగా ఎగ్జిట్ పోల్స్... దూసుకుపోయిన సెన్సెక్స్

భారత్ లో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఆదివారం వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థలు... మళ్లీ ఎన్డీయేదే అధికారం అని తేల్చేశాయి. కాగా... ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపించాయి. 

Sensex jumps over 900 points as exit polls show NDA's victory
Author
Hyderabad, First Published May 20, 2019, 10:58 AM IST

భారత్ లో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఆదివారం వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థలు... మళ్లీ ఎన్డీయేదే అధికారం అని తేల్చేశాయి. కాగా... ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపించాయి. ఎన్డీయే తిరిగి  అధికారం చేపడుతుందని వచ్చిన సర్వేలు సెన్సెక్స్ దూసుకోవడానికి కారణమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్..900 పాయింట్లకు పైగా దూసుకుపోయింది. రూపాయి కూడా బలపడింది.

దేశీయ కరెన్సీ రూపాయి భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. శుక్రవారం నాటి ముగింపు 70.22 తో పోలిస్తే రూపాయి 9.49వద్ద ప్రారంభమైంది.    డాలరు మారకంలో 73 పైసలు ఎగిసింది.  దీంతో రెండు వారాల గరిష్టాన్ని తాకింది. అంతేకాదు డిసెంబరు 2018 తరువాత    ఓపెనింగ్‌లో భారీగా లాభపడటం ఇదే తొలిసారి. అటు బీజేపీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు సర్వేలన్నీ వెల్లడించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో  దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఏకంగా 900 పాయింట్లు  ఎగిశాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల్లో ఉంది. కానీ..23న వెలువడే వాస్తవ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మార్కెట్‌ అంచనాల్ని చేరలేకపోయినా, పెద్ద పతనం సంభవించే ప్రమాదం కూడా వుంటుంది. ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా వున్నా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ర్యాలీ భారీగా వుండకపోవొచ్చన్న అభిప్రాయాల్ని పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios