కరోనా  మహామారి వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ ఆధీనంలోని ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థ కూడా దాని నుండి తప్పించుకోలేదు. 2020 సంవత్సరంలో సౌదీ అరాంకో లాభాలలో భారీ క్షీణత ఏర్పడింది. దీంతో  కంపెనీ లాభం 49 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సౌదీ అరాంకో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటి.

అంతకుముందు 2019 సంవత్సరంలో కంపెనీ 88.2 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించింది. కాగా 2018లో  కంపెనీ లాభాలు 111.1 బిలియన్ డాలర్లు. ఈ లాభాలు ఆపిల్, గూగుల్ సంస్థ ఆల్ఫాబెట్ మొత్తం వార్షిక లాభం కంటే ఎక్కువ.

ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ స్తంభించి పోయిన సంగతి మీకు తెలిసి ఉండవచ్చు, ఈ కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయాయి. అయితే కోవిడ్ -19 టీకా ప్రచారం కారణంగా ముడి చమురు ధరలు గత కొన్ని వారాలుగా భారీగా పెరిగాయి.

also read టీసీఎస్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి వేతనపెంపు.. ...

ఈ సందర్భంలో త్రైమాసిక ప్రాతిపదికన సంవత్సరానికి 18.75 బిలియన్ డాలర్లు లేదా 75 బిలియన్ డాలర్ల డివిడెండ్ చెల్లించే వాగ్దానాన్ని నెరవేరుస్తామని అరాంకో పేర్కొంది.  సౌదీ అరాంకో సంస్థ 2019డిసెంబర్‌లో ఐపీఓను ప్రారంభించింది. 

ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థతో రిలయన్స్ చర్చలు 
 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 20 శాతం వాటాను విక్రయించడానికి  ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థ సౌదీ అరామ్‌కోతో చర్చలు జరుపుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఒప్పందం ఆగిపోయింది. రిలయన్స్ సంస్థ  ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం 75 బిలియన్ డాలర్లు.

కోవిడ్ -19 మహమ్మారి  కారణంగా సౌదీ అరామ్‌కోతో ప్రతిపాదిత ఒప్పందం సకాలంలో పూర్తి కాలేదని 2020 జూలై 15 న జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ ఎజిఎంలో  చైర్మన్ ముకేష్ అంబానీ అన్నారు. కానీ సౌదీ అరామ్‌కోతో మా రెండు దశాబ్దాల సుదీర్ఘ వ్యాపార సంబంధాన్ని మేము గౌరవిస్తాము అలాగే దీర్ఘకాలిక భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.