అమెరికా కరెన్సీ డాలర్‌‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఎక్స్చేంజీ మార్కెట్లో 40 పైసలకు పైగా పడిపోయి జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్‌లో ఒకే రోజు 49 పైసలు పడిపోయి.. 70.59 వద్ద ముగిసింది.

అమెరికా కరెన్సీ డాలర్‌‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఎక్స్చేంజీ మార్కెట్లో 40 పైసలకు పైగా పడిపోయి జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్‌లో ఒకే రోజు 49 పైసలు పడిపోయి.. 70.59 వద్ద ముగిసింది. రూపాయి మంగళవారం ముగింపు 70.10 కాగా, బుధవారం ట్రేడింగ్ ఒక దశలో రూపాయి 70.65 స్థాయికి కూడా పడిపోయింది. ఇంట్రాడేలో తాజా కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. 

* విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో డాలర్‌కు డిమాండ్ బాగా పెరిగింది. 

* బ్యాంకులు, ఆయిల్ రిఫైనర్స్ నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణం. చమురు దిగుమతిదారుల నుంచి నెలాంతపు డాలర్ల డిమాండ్ తీవ్రమైంది..

* దేశీయ మార్కెట్ నుంచి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

* ఆసియా స్టాక్ మార్కెట్లు ముందుగా పుంజుకోవడంతో పాటు వాణిజ్య యుద్ధ భయాల నుంచి చైనా మార్కెట్లు తప్పించుకుని నిలకడగా స్ధిరపడటం.. ఉత్తర అమెరికా మరియు ఐరోపా వ్యాపార ఒత్తిళ్లు స్థిరమైన ఆదరణ పొందడం రూపాయిపై ప్రభావం చూపింది.

* దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ఆరంభమవ్వడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఉదయం పది గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 45 పాయింట్లు కోల్పోయి 38,678 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 11,672 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.