వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే : ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్ .. హైక్స్, ప్రమోషన్స్‌‌‌కి మెలిక

తన ఉద్యోగులకు టెక్ దిగ్గజం గూగుల్ వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి రావాల్సిందేనని స్పష్టం చేసింది. లేని పక్షంలో పర్ఫార్మెన్స్ రివ్యూలపై , ప్రమోషన్స్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొంది. 
 

Return to office 3 days a week or get poor performance reviews : Google warns employees ksp

కరోనా , లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అందించాయి. అయితే ప్రస్తుతం పరిస్ధితులు చక్కబడిన నేపథ్యంలో అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను విడతలవారీగా ఎత్తేస్తున్నాయి. తొలుత హైబ్రీడ్ మోడల్‌ను అవలంభిస్తూ వచ్చిన కంపెనీలు.. ఇప్పుడు దానిని కూడా ఎత్తివేసి కరోనాకు ముందున్న విధంగా ఆఫీసులకు రావాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. 

తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చింది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వారానికి ఖచ్చితంగా మూడు రోజుల పాటు కార్యాలయాల్లో పనిచేయాలని, రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగుల పెర్ఫామెన్స్ రివ్యూపై ఇది ప్రభావం చూపుతుందని గూగుల్ స్పష్టం చేసింది. ఆ రివ్యూ సమయంలో ఉద్యోగుల హాజరును క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులందరికీ బుధవారం ఈమెయిల్ ద్వారా సమాచారం పంపింది. 

ఏ సంస్థలోనైనా ఉద్యోగులు బృందంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియాన సిసోని పేర్కొన్నారు. మరోవైపు.. హైబ్రిడ్ మోడల్‌లను ఉల్లంఘిస్తున్న ఉద్యోగులతో గూగుల్ హెచ్ఆర్ విభాగం మాట్లాడి తక్షణ చర్యలకు ఉపక్రమించనుంది. ప్రస్తుతం కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలో పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్‌ను పూర్తిగా ఎత్తివేసి వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీకి కట్టుబడి వుండాలని ఉద్యోగులపై గూగుల్ ఒత్తిడి తెస్తోంది. 

అయితే సంస్థ నిర్ణయంపై గూగుల్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అస్పష్టమైన హాజరు ట్రాకింగ్ పద్ధతులకు తాము వ్యతిరేకమని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ యూనియన్‌లో 1400 మందికిపైగా సభ్యులు వున్నారు. ఈ సంవత్సరాంతంలో గూగుల్ కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు 1,90,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. గతేడాది ఏప్రిల్‌లో వారానికి మూడు రోజులు పాటు ఉద్యోగులను  కార్యాలయాలకు రప్పించాలని గూగుల్ ప్లాన్ చేసింది. 2021లో కోవిడ్ 19 సమయంలో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులు రిమోట్‌గా పూర్తి సమయం పనిచేయవచ్చని తెలిపింది 

ఈ ఏడాది జనవరిలో ఆల్ఫాబెట్ తన చరిత్రలోనే తొలిసారిగా భారీగా ఉద్యోగాల కోతలను అమల్లోకి తెచ్చింద. ఆల్ఫాబెట్ శ్రామిక శక్తిలో 6 శాతానికి పైగా దాదాపు 12000 మంది సిబ్బందిని విధుల్లోంచి తొలగించింది. 2021లో కొత్త కార్యాలయాలు, డేటా సెంటర్‌ల కోసం 7 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ ఏప్రిల్‌లో ఆల్ఫాబెట్ తొలి త్రైమాసిక ఆదాయ నివేదికలో ఆఫీస్ స్పేస్ తగ్గింపుపలకు సంబంధించి 564 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios