రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, బిలియనీర్ ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా డిసెంబర్ 10న కొడుకుకు జన్మనిచ్చింది. అంబానీ కుటుంబంలో కొత్త సభ్యుడి రాకతో ఆనందాన్ని రేకెత్తించింది.

ముకేష్ అంబానీ మనవడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 9 మార్చి 2019న ఆకాష్ అంబానీ, శ్లోక మెహతాల వివాహం  జరిగింది. విరిద్దరూ స్కూల్ రోజుల నుండి మంచి స్నేహితులు, అలాగే ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకున్నారు.

ముకేష్ అంబానీ తాత అయ్యారు. అతని పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా కొడుకుకి జన్మనిచ్చింది. ఇప్పుడు శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీ పిల్లల తల్లిదండ్రులు అయ్యారు" అని అంబానీ కుటుంబ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ముకేష్ అంబానీ తన మనవడితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముకేష్ అంబానీ (63), అతని భార్య నీత అంబానీకి ముగ్గురు పిల్లలు - కవల పిల్లలు ఆకాష్, ఇషా తరువాత అనంత్ అంబానీ పుట్టాడు. విదేశాలలో కొంతకాలం గడిపిన తరువాత అంబానీ కుటుంబం గత నెలలో అంటే దీపావళికి ముందు ముంబైకి తిరిగి వచ్చారు.  

also read ఫ్యూచర్‌ రిటైల్‌లోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వాటా విక్రయం.. 3.65 శాతనికి రూ.132 కోట్లు.. ...

ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోక మెహతా ఒక కొడుకుకు జన్మనిచ్చింది అనే వార్తాతో  ముకేష్ అంబానీ సంపద కూడా 2 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

ఈ సంపద పెరుగుదలతో ముకేష్ అంబానీ ర్యాంకింగ్ కూడా మెరుగుపడింది. ముకేష్ అంబానీ చాలా కాలంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో 10వ స్థానంలో ఉన్నాడు, కానీ గురువారం అతని సంపద పెరగడం వల్ల ఇప్పుడు ప్రపంచంలో 9వ ధనవంతుడు అయ్యాడు.

శుక్రవారం ఉదయం సంపదలో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ అతను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు.

ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియోలో డైరెక్టర్ పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అతను జియో స్ట్రాటజీ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా.

 శ్లోకా మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త రసైల్ మెహతా కుమార్తె. అతని వజ్రాల వ్యాపారం ప్రపంచంలోని అగ్ర వజ్రాల ఆభరణాల సంస్థగా పరిగణించబడుతుంది. దేశంలో 25కి పైగా నగరాల్లో దీనికి స్టోర్స్‌ ఉన్నాయి. అలాగే సంస్థ విదేశాలకు కూడా విస్తరించింది.