న్యూఢిల్లీ: రెపోరేటును 25 పాయింట్లు తగ్గిస్తూ గురువారం నాడు ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది. మరో వైపు వడ్డీ రేట్లను కూడ తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.

రెపోరేటును6.5 నుండి 6.25 పాయింట్లకు తగ్గిస్తూ  నిర్ణయం తీసుకొన్నారు. గురువారం నాడు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు.  రివర్స్ రెపో రేటు 6 శాతానికి తగ్గించారు.  దీంతో గృహ నిర్మాణాలపై తీసుకొనే  వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.