ముంబై: నాణ్యమైన సూట్లు తయారు చేయడానికి ఉపయోగించే వూల్  ఫాబ్రిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఉద్యోగులు వర్క్ ఫ్రోం హోం చేస్తుండటంతో సూట్లు, బిజినెస్ దుస్తులు ధ‌రించ‌డం మానేశారని కంపెనీ వ్యాఖ్యానించింది.

రేమండ్ 2020-21 సంవత్సరానికి 35% వరకు ఖర్చులు తగ్గించడానికి ఉద్యోగాలు, అద్దెలు, మార్కెటింగ్ ఖర్చులను తగ్గిస్తున్నట్లు చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా చెప్పారు.

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి ముంబైకి చెందిన కంపెనీ ఉద్యోగాలు, అద్దెలు, మార్కెటింగ్ ఖర్చులను 35% తగ్గిస్తున్నట్లు చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా గత వారం వర్చువల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

సెంట్రల్ బ్యాంక్ అందించే వన్-టైమ్ ప్రోగ్రాం కింద రుణాలు చెల్లింపు స్తంభింపచేయాలని కూడా కోరింది. "మాకు తెలుసు ఈ సంక్షోభంలో మేము బలంగా నిలబడతాము. రేమండ్ దీనిని తిరిగి సెట్ చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంది" అని సింఘానియా చెప్పారు.

also read కేంద్రం రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించే స్థితిలో లేదు: కేంద్ర ఆర్థిక‌ శాఖ‌ ...

శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కానీ కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దుస్తులకు డిమాండ్‌ను భారీగా తగ్గించింది, రెండు శతాబ్దాల నాటి బ్రూక్స్ బ్రదర్స్ గ్రూప్ ఇంక్‌ ఈ నెలలో దివాలా తీసింది.

1925లో ఒకప్పటి బొంబాయి శివార్లలో ఒక చిన్న ఉన్ని మిల్లుతో ప్రారంభమైన రేమండ్, కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో ఈ సంవత్సరం వాటాలు అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి.

మార్చి 25న భారత్ లాక్ డౌన్ అయ్యింది. దేశంలోని కొన్ని ప్రాంతాలలో దుకాణాలు, కార్యాలయాలు ఇప్పటికీ మూసివేయబడ్డాయి. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, రేమండ్ మూలధన వ్యయాలైన స్టోర్ ఓపెనింగ్స్, పునర్నిర్మాణాలు, సాంకేతిక అప్ డేట్స్ ను వాయిదా వేసింది.

ప్రస్తుతానికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేయడానికి రేమండ్ బెంగళూరు కర్మాగారాన్ని ఉపయోగిస్తోందని సింఘానియా చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పోటీపడే బెస్పోక్ సూట్ తయారీదారులగా కాకుండా రేమండ్ సంస్థ అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.