ఉద్యోగం లేదని బాధపడుతున్నారా...అయితే కేంద్ర ప్రభుత్వం యువ వ్యాపార వేత్తల కోసం ఒక స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారులు, ఎంట్రపెన్యూర్ల కోసం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) స్కీమ్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద అన్ని అనమతులు పొందితే కేవలం పది రోజుల్లోనే రూ.10 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
Pradhan mantri Mudra Loan Yojana: కరోనా సమయంలో యువత తమ సొంత ఉపాధి కోసం నిరంతరం ఆలోచిస్తుంటారు. మీ వద్ద ఒక్కోసారి మంచి ఐడియా ఉన్నప్పటికీ, వ్యాపారం ప్రారంభించేందుకు మూల ధనం చాలా అవసరం, అందుకోసం ప్రైవేటు అప్పుల జోలికి వెళితే మీ లాభం కాస్తా వడ్డీలు కట్టేందుకే సరిపోతుంది. అయితే దీని కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. మీరు డబ్బులు లేక, స్వయం ఉపాధి ప్రారంభించడానికి ఇబ్బందులు పడుతున్నారా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యాపారం ప్రారంభించడానికి 10 లక్షల వరకు రుణం ఇస్తోంది. మీరు కూడా స్వయం ఉపాధి పొందాలనుకుంటే, మీరు దాని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్న మోదీ ప్రభుత్వం...
వాస్తవానికి, ప్రధాన్ మంత్రి ముద్రా లోన్ యోజన ( Mudra Loan Yojana) కింద, ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సరసమైన ధరలకు రుణాలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం 2015 లో ప్రారంభించింది. దీని లక్ష్యం చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందించడం.
మూడు కేటగిరీలలో లోన్ అందుబాటులో ఉంటుంది
ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం ( Mudra Loan Yojana) కింద మూడు కేటగిరీల్లో రుణాలు ఇస్తారు. మొదటి కేటగిరీ శిశు కింద 50 వేల వరకు రుణం ఇస్తారు. రెండో కేటగిరీ కిషోర్ కింద 50 వేల నుంచి 5 లక్షల వరకు, మూడో కేటగిరీ తరుణ్ కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణం ఇస్తారు. రుణం తిరిగి చెల్లించే కాలాన్ని కూడా ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.
హామీ లేకుండా రుణం పొందే అవకాశం..
ప్రధాన మంత్రి ముద్రా రుణ పథకం ( Mudra Loan Yojana) కింద ప్రభుత్వం పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తుంది. లోన్ పొందడానికి ప్రాసెసింగ్ ఛార్జీ లేదు. ఇందులో కనీస వడ్డీ రేటు దాదాపు 12 శాతం. వడ్డీ రేట్లు రుణ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటాయి.
లోన్ కోసం దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు
రుణం ( Mudra Loan Yojana) తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే, క్రెడిట్ స్కోర్ సరిగ్గా ఉండాలి, లేకుంటే బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. రుణం తీసుకోవాలంటే ఆధార్ కార్డు, నామినీ, బిజినెస్ ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన పత్రాలు అందుబాటులో ఉంటే, ప్లాన్ అంగీకారం పొందితే చాలు దరఖాస్తు చేసిన 10 రోజులలోపు రుణం లభిస్తుంది.
ముద్రా లోన్ కోసం ( Mudra Loan Yojana) ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
ఈ పథకం కింద, ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు మొదలైన వాటి నుండి రుణాలు తీసుకోవచ్చు. ఈ పథకం కింద 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 17 ప్రైవేట్ బ్యాంకులు, 27 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు 25 మైక్రో ఫైనాన్స్ సంస్థలు అసోసియేట్ అయి ఉన్నాయి.
లోన్ పొందడానికి ముద్ర లోన్ ( Mudra Loan Yojana) దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. రుణ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ముద్ర లోన్ లెండింగ్ బ్యాంక్‌లో దరఖాస్తును సమర్పించండి. దరఖాస్తు ఆమోదించబడితే, మీకు రుణం లభిస్తుంది.
