Asianet News TeluguAsianet News Telugu

నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. 

PNB fraud Singapore High Court orders freezing bank account of Nirav Modis family
Author
Singapore, First Published Jul 2, 2019, 5:49 PM IST

స్విట్జర్లాండ్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  మంగళవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.

తమ వినతి మేరకు రూ.44.41 కోట్లు డిపాజిట్లు ఉన్న పెవిలియన్ పాయింట్ కార్పోరేషన్ కంపెనీ ఖాతాను సింగపూర్ కోర్టు నిలిపివేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ కంపెనీకి మయాంక్ మొహ్తా, పూర్వీ మోడీలు ఓనర్లు.  భారత బ్యాంకుల నుండి ఈ సొమ్మును అక్రమంగా తరలించారని ఈ ఖాతాలను నిలిపివేయాలని  ఈడీ అభ్యర్థించింది.

ఈ అభ్యర్థన మేరకు సింగపూర్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొందని ఈడీ తెలిపింది. నీరవ్ మోడీ, ఆయన సోదరి పూర్వి ఖాతాను  స్విస్ ప్రభుత్వం స్థంభింపజేసింది. ఇదే తరహాలో సింగపూర్ సర్కార్ కూడ నిర్ణయం తీసుకొంది.  ఈ ఏడాది మార్చిలో నీరవ్ మోడీని బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios