Asianet News TeluguAsianet News Telugu

PM Kisan money: ప్రధాని మోదీ ఇస్తున్న పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడలేదా, అయితే Onlineలో ఇలా చేయండి...

PM Kisan money: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడత రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. గత సంవత్సరం, ఏప్రిల్-జూలై వాయిదా మే 15న రైతుల ఖాతాకు బదిలీ అయ్యింది. ఈ సంవత్సరం మే 31న PM కిసాన్ eKYCని పూర్తి చేయడానికి చివరి తేదీ. అంతేకాదు పీఎం కిసాన్ యోజనలో మీ వివరాలు తప్పుగా నమోదు అయి ఉంటే ఆన్ లైన్ ద్వారా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 

pm kisan pm kisan 11th instalment how to update bank account in pm kisan
Author
Hyderabad, First Published May 11, 2022, 6:14 PM IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి  (Prime Minister Kisan Samman Nidhi) కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 10 వాయిదాలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చాయి. ఇప్పుడు 11వ విడత రాబోతోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, నమోదు చేసుకున్న రైతుకు సంబంధించిన మొత్తం సమాచారం సరిగ్గా ఉండటం అవసరం. బ్యాంకు ఖాతా, లింగం, ఆధార్ కార్డు తదితరాలకు సంబంధించిన ఏదైనా సమాచారం తప్పుగా నమోదైతే రైతు ఖాతాలో డబ్బులు పడటం ఇబ్బందిగా మారుతుంది. 

కిసాన్ సమ్మాన్ నిధి యోజన  (Prime Minister Kisan Samman Nidhi) కింద నమోదైన రైతుకు సంబంధించిన ఏదైనా సమాచారం PM Kisan పోర్టల్‌లో తప్పుగా నమోదు చేసి ఉంటే, దానిని సరిదిద్దుకోవచ్చు. ఈ పనిని మీరు ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో చేయవచ్చు. బ్యాంకు ఖాతా, లింగం, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో మిస్టేక్స్ ఉంటే, వాటిని సరిచేసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

>> ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inకి వెళ్లండి.
>> Home Pageలో కుడి వైపున, మీకు Farmers corner అనే ఆప్షన్ కనిపిస్తుంది.
>> Help-Desk ఎంపికపై క్లిక్ చేయండి. కొత్త పేజీ తెరుచుకుంటుంది. 
>> ఈ పేజీలో, ఆధార్ నంబర్, ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, Gate Data బటన్‌పై క్లిక్ చేయండి.
>> మీరు మీ సమాచారాన్ని చూసే విండో తెరుచుకుంటుంది. 
>> ఇక్కడ  Grievance Type బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ పై క్లిక్ చేయడం ద్వారా, మీరు సరిదిద్దాలనుకునే ఏదైనా పొరపాటుపై క్లిక్ చేయండి.
>> మీ బ్యాంక్ ఖాతా తప్పుగా నమోదు చేసారు అని అనుకుందాం, అప్పుడు మీరు Account Number Is Not Corrected  అనే ఎంపికను ఎంచుకోవాలి.
>> ఇప్పుడు Description boxలో, మీరు మీ ఖాతా నంబర్ గురించి సరైన సమాచారాన్ని ఇవ్వాలి.
>> ఈ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మీరు క్యాప్చా నింపాలి.
>> ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
>> మీరు PM కిసాన్ యోజన కింద బ్యాంక్ ఖాతా నంబర్‌ను మార్చడానికి PM కిసాన్  సంబంధిత అధికారికి ఫిర్యాదు చేరుతుంది. బ్యాంకు ఖాతా సమాచారం కొద్ది రోజుల్లో సవరించబడుతుంది.

మీరు ఈ ఫారమ్‌ని ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత మీ సమాచారం వెంటనే అప్ డేట్ అవ్వదు. ఈ ఫారమ్‌ను సంబంధిత అధికారి చూసిన తర్వాత, ఆపై దానిపై చర్య తీసుకుంటారు.  సమాచారం సరిదిద్దడానికి సమయం పడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios