Asianet News TeluguAsianet News Telugu

Petrol Diesel Prices: కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Petrol Diesel Prices: పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం. భారీగా తగ్గించింది.  దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మే 23న పెట్రోల్ ధర లీటరుకు రూ.109.64  పలుకుతుండగా, డీజిల్ రేటు రూ.97.8 వద్ద కొనసాగుతోంది. 

Petrol Price Diesel Rate Today in Hyderabad
Author
Hyderabad, First Published May 23, 2022, 9:05 AM IST

Petrol Diesel Prices:  సామాన్యులకు ఇంధన భారం నుంచి  ఉపశమనం ఇస్తూ.. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం. భారీగా తగ్గించింది. దీంతో పెట్రోల్, డీజిల్  ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు  రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పన్నును అంటే వ్యాట్‌ను తగ్గించుకుంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను సడలించడంతో పెట్రోలు-డీజిల్ ధరలు మరింత చౌకగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్ తగ్గించాయి. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.27 పలుకుతోంది.  మరోవైపు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా పలుకుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర 113 డాలర్లకు చేరుకోవడం కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే...
హైదరాబాద్‌లో మే 23న పెట్రోల్ ధర లీటరుకు రూ.109.64  పలుకుతోంది. అలాగే డీజిల్ రేటు రూ.97.8 వద్ద కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో పెట్రోల్ ధర రూ.111.74 పలుకుతోంది. డీజిల్ ధర రూ.99.49గా ఉంది.

 

నాలుగు మహానగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు
>> ఢిల్లీ పెట్రోల్‌ రూ.96.72, డీజిల్‌ రూ.89.62
>> ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.109.27, డీజిల్ రూ.95.84
>>  చెన్నై పెట్రోల్‌ రూ.102.63, డీజిల్‌ రూ.94.24
>> కోల్‌కతా పెట్రోల్‌ రూ.106.03, డీజిల్‌ రూ.92.76

కొత్త రేట్లు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు..
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్, ఇతర వస్తువులను జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడానికి ఇదే కారణం.

నేటి తాజా ధరను మీరు ఇలా తెలుసుకోవచ్చు
మీరు SMS ద్వారా పెట్రోల్ డీజిల్ రోజువారీ రేటును కూడా తెలుసుకోవచ్చు (రోజువారీ డీజిల్ పెట్రోల్ ధరను ఎలా తనిఖీ చేయాలి). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSPని 9224992249 నంబర్‌కు మరియు BPCL వినియోగదారులు RSPని 9223112222 నంబర్‌కు పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPriceని 9222201122 నంబర్‌కు పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios