నెల రోజుల క్రితం రికార్డు స్థాయికి పడిపోయిన క్రూడాయిల్ ధరలు గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజుల క్షీణత తర్వాత క్రూడాయిల్ మళ్లీ పుంజుకుంది. సోమవారం ఉదయం WTI క్రూడాయిల్ బ్యారెల్‌కు 88.37 డాలర్లకు, బ్రెంట్ క్రూడాయిల్ కూడా బ్యారెల్ కు 96.21 డాలర్లకు పెరిగింది.
దేశవ్యాప్తంగా నేడు సోమవారం పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దాదాపు గత ఐదు నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో మే నెలలో ఇంధన ధరల్లో చివరిగా హెచ్చుతగ్గులు కనిపించాయి.
ప్రముఖ మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు
తాజా సవరించిన ధరల ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94 కాగా, డీజిల్ ధర రూ.87.89గా ఉంది.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
- పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74
నెల రోజుల క్రితం రికార్డు స్థాయికి పడిపోయిన క్రూడాయిల్ ధరలు గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజుల క్షీణత తర్వాత క్రూడాయిల్ మళ్లీ పుంజుకుంది. సోమవారం ఉదయం WTI క్రూడాయిల్ బ్యారెల్‌కు 88.37 డాలర్లకు, బ్రెంట్ క్రూడాయిల్ కూడా బ్యారెల్ కు 96.21 డాలర్లకు పెరిగింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతిరోజు ఇంధన ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేస్తాయి. పెట్రోల్ లేదా డీజిల్ ధరలో ఏదైనా మార్పు అమలు చేస్తాయి. వివిధ రాష్ట్రాలలో వేర్వేరు VAT రేట్లు కారణంగా, పెట్రోల్ - డీజిల్ ధరలు రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండవు.