దిగొస్తున్న క్రూడాయిల్.. నేటికి ఏడాది కావొస్తున్న తగ్గని పెట్రోల్ డీజిల్ ధరల భారం.. ఇవాళ్టి ధరలు ఇవే..

భారతదేశంలో చమురు ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017 కి ముందు  చమురు ధరలలో మార్పు ప్రతి 15 రోజుల తర్వాత జరిగేది. ఈ రోజు దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజా పెట్రోల్ , డీజిల్ ధరలను విడుదల చేశాయి.  
 

Petrol diesel  Price Today: A slight drop in crudeoil   prices check latest fuel rates in metros here-sak

నేడు  జూన్ 10న అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి . WTI క్రూడాయిల్  బ్యారెల్‌కు $1.12 డాలర్లు తగ్గి $70.17 డాలర్లకు చేరుకుంది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $1.17 డాలర్లు తగ్గి $74.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది . భారతదేశంలో చమురు ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017 కి ముందు  చమురు ధరలలో మార్పు ప్రతి 15 రోజుల తర్వాత జరిగేది. ఈ రోజు దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజా పెట్రోల్ , డీజిల్ ధరలను విడుదల చేశాయి.  

ఉత్తర భారతంలో పెట్రోల్‌పై 24 పైసలు, హర్యానాలో డీజిల్‌పై 23 పైసలు తగ్గింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 17 పైసలు తగ్గాయి. రాజస్థాన్ గురించి మాట్లాడినట్లయితే   అక్కడ పెట్రోల్ ధర రూ. 1.03, డీజిల్ ధర 93 పైసలు పెరిగింది . పశ్చిమ బెంగాల్‌లో కూడా పెట్రోల్ ధర 44 పైసలు, డీజిల్ ధర 41 పైసలు పెరిగింది. పంజాబ్‌లో పెట్రోల్ ధర 51 పైసలు , డీజిల్ 48 పైసలు పెరిగింది. గుజరాత్, మహారాష్ట్రల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. 

మెట్రో నగరాల గురించి మాట్లాడితే

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.72 , డీజిల్ ధర రూ .89.62.

ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర రూ .94.27 గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర రూ .92.76 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ .102.80 , డీజిల్ ధర రూ .94.40.

నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ .96.79 , డీజిల్ ధర  రూ .89.96 గా ఉంది .

ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ .96.58 , డీజిల్ లీటరు  ధర రూ .89.75 కి చేరింది

లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.58 , డీజిల్ ధర రూ .89.77 గా ఉంది.

పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ .107.24 , డీజిల్ ధర రూ .94.04 గా ఉంది.

పోర్ట్ బ్లెయిర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ .84.10 , డీజిల్ ధర రూ .79.74 గా ఉంది. 

హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

మీరు ప్రతిరోజూ మీ నగరంలో  అప్ డేట్ చేసిన ధరలను  చెక్  చేయాలనుకుంటే, మీరు SMS ద్వారా ప్రతిరోజు  పెట్రోల్ డీజిల్ ధరలను  తెలుసుకోవచ్చు . ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 కి sms పంపండి . BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9223112222 కి SMS పంపవచ్చు .  HPCL కస్టమర్లు HPPrice ఇంకా వారి సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 కి sms పంపడం ద్వారా తాజా ధరలను తెలుసుకోవచ్చు .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios