Petrol Diesel Price in Hyderabad : పెట్రోల్ డీజిల్ ధరల్లో నేడు కూడా స్థిరంగానే ఉన్నాయి. శనివారం హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన పట్టణాల్లో పెట్రోెల్, డీజిల్ ధరలను తెలుసుకుందాం.
Petrol Diesel Price in Hyderabad : పెట్రోల్ డీజిల్ ధరలు నేడు అంటే శనివారం కూడా స్థిరంగానే ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఒక లీటరు పెట్రోల్ ధర రూ. 109.66 డీజిల్ ధర లీటరుకు రూ. 97.82 పలుకుతోంది. గడచిన ఎనిమిది నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎనిమిది రూపాయల చొప్పున తగ్గాయి అప్పటినుంచి ఇదే ధర కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశీయంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు అందులో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రెండింటిని జిఎస్టి పరిధిలోకి తెస్తామని ఈ మేరకు రాష్ట్రాలకు ప్రతిపాదనలను పంపామని రాష్ట్రాల నుంచి ఆమోదం కోసం చూస్తున్న ఎదురుచూస్తున్నామని ఆమె తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై అత్యధికంగా వ్యాట్ రూపంలో పన్నును వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్ పై 27% VAT వసూలు చేస్తుండగా, పెట్రోల్ పై 35.20% VAT వసూలు చేస్తున్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోల్ పై రూ.4 అదనపు వ్యాట్ + లీటర్‌కు రూ.1 రోడ్డు అభివృద్ధి సెస్ + 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు.
ఒకవేళ పెట్రోల్ డీజిల్ లను జిఎస్టి పరిధిలోకి తెచ్చినట్లయితే గరిష్ట జిఎస్టి స్లాబ్ అయినటువంటి 28 శాతం పన్ను కిందకు వచ్చే అవకాశం ఉంది. దీని కిందకు వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
