OCCRP Report : ఇండియన్ కార్పోరేట్ కంపెనీ బాసుల గుండెలు లబ్ డబ్...హిండెన్ బర్గ్ తరహాలో మరో బాంబు రెడీ..

హిండెన్ బర్గ్ తరహాలో భారత కార్పొరేట్ సంస్థల అవకతవకలపై మరో బాంబు పేల నుంది. ఈసారి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) సంస్థ పలు కంపెనీలకు అక్రమ మార్గంలో విదేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడుల లిస్టును విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.

OCCRP Report The hearts of the bosses of Indian corporate companies are ready for another bomb like Hindenburg MKA

భారతదేశంలోని కార్పొరేట్ కంపెనీలపై మరోసారి పిడుగు పడనుంది. గతంలో హిండెన్ బర్గ్ నివేదిక అదానీ గ్రూపుపై ప్రతాపం చూపిస్తే. ఈ సారి మాత్రం ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) రూపంలో  మరో విదేశీ నివేదిక భారత మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 

హిండెన్‌బర్గ్ నివేదిక తరహాలోనే ఇన్వెస్టిగేటివ్  జర్నలిస్టుల గ్లోబల్ నెట్‌వర్క్ అయిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)  భారత కార్పొరేట్ కంపెనీల  అవకతవకలపై నివేదికలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వార్తా సంస్థ PTI ప్రకారం, భారతీయ పెద్ద కార్పొరేట్ సంస్థలపై ఇన్వెస్టిగేటివ్  నివేదికలను జారీ చేయడంలో చివరి దశలో ఉంది. OCCRP సంస్థకు వివాదాస్పద బిలియనీర్ జార్జ్ సోరోస్ , రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వ్యక్తులు నిధులు అందిస్తున్నారు.  ఇందులో జార్జ్ సోరోస్  ప్రస్తుతం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని  అధికార పార్టీ ఇప్పటికే పలుమార్లు విమర్శించింది. 

త్వరలో విడుదల కాబోయే OCCRP  నివేదికలో  భారత్ కు చెందిన దిగ్గజ బిజినెస్ గ్రూప్ కంపెనీల షేర్లలో డబ్బు పెట్టుబడి పెట్టే విదేశీ పెట్టుబడిదారుల పేర్లను బహిర్గతం  చేసే వీలుందని. వార్తలు వస్తున్నాయి

జార్జ్ సోరోస్ మోడీ ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకిగా ఉన్నారు…

ప్రముఖ బిలియన్ జార్జ్ సోరోస్‌ మోదీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జార్జ్ తన సంస్థ అయిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా OCCRPకి నిధులు సమకూర్చడం గమనార్హం. ఇది కాకుండా ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ ,  ఓక్ ఫౌండేషన్ నుండి కూడా OCCRP  నిధులను అందుకుంటుంది. OCCRP 2006 సంవత్సరంలో స్థాపించారు. OCCRP ఆసియా, యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా అంతటా విస్తరించి ఉంది.

హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బతో అదానీ షేర్లు దెబ్బతిన్నాయి

గతంలో US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 24న అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను ప్రచురించింది. ఇందులో అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూప్‌ షేర్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అయ్యాయి. 

OCCRP వ్యవస్థీకృత నేరాల  బయట పెట్టడంలో తన నైపుణ్యాన్ని క్లెయిమ్ చేస్తోంది. ఇది మీడియా సంస్థలతో భాగస్వామ్యం ద్వారా పలు కథనాలను ప్రచురిస్తుంది. దేశీయ ఆర్థిక మార్కెట్లపై ఈ నివేదిక విడుదల వల్ల కలిగే  ప్రభావంపై ఇప్పటికే భారతీయ నియంత్రణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం మాదిరిగానే పరిస్థితి కూడా ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios