Asianet News TeluguAsianet News Telugu

రానున్న 4-6 నెలలు జాగ్రత్త.. కరోనా మరింత విజృంభించవచ్చు: బిల్‌ గేట్స్‌ హెచ్చరిక

రాబోయే 4 నుండి 6 నెలలలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభించవచ్చు  అని బిల్‌ గేట్స్‌  ఆదివారం హెచ్చరించారు.

Next four to six months could be worst of pandemic says Bill Gates
Author
Hyderabad, First Published Dec 14, 2020, 1:48 PM IST

కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి, వాటిని పంపిణీ చేసే ప్రయత్నంలో భాగమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రాబోయే 4 నుండి 6 నెలలలో కరోనా వైరస్ మహమ్మారి మరింత విజృంభించవచ్చు ఆదివారం హెచ్చరించారు.

" రానున్న 4 నుండి 6 నెలలలో కరోనా మహమ్మారి  ‌మరిన్ని కొత్త సవాళ్లను తీసురవొచ్చు. ఐ‌హెచ్‌ఎం‌ఈ (ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్) ప్రకారం 2 కోట్ల అదనపు మరణాలను సూచిస్తుంది.

మాస్కూలు ధరించడం, చేతులు కలపకుండ ఉండటం వల్ల  మరణాలను ఎక్కువ శాతం నివారించవచ్చు "అని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కొ-చైర్ మెంబర్ అన్నారు.

గత కొన్ని వారాల నుండి యు.ఎస్ లో రికార్డు స్థాయిలో అధిక కరోనా కేసులు, మరణాలు, చికిత్స ఎదురుకుంటుంది. అమెరికా దీనిని సమర్ధవంతంగా ఎదురుకుంటుంది అని నేను అనుకుంటున్నాను" అని అన్నారు. 2015లోనే ఇటువంటి మహమ్మారి గురించి ప్రపంచాన్ని బిల్  గేట్స్ హెచ్చరించారు.

also read జనవరి 1 నుంచి చెక్కులకు కొత్త రూల్స్‌.. మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే.. ...

" నేను 2015లో భవిష్యత్తుపై సూచనలు చేసినప్పుడు, అధిక మరణాలు ఎక్కువగా ఉండవచ్చని నేను వెల్లడించాను. కాబట్టి, ఈ వైరస్ దాని కంటే ఎక్కువ ప్రాణాంతకం కావచ్చు.

కాని నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఐదేళ్ల క్రితం నేను ఊహించిన అంచనాల కంటే యూ‌ఎస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చాలా ఎక్కువ ఉందని ఆయన అన్నారు.

కోవిడ్-19 వల్ల ఇప్పటివరకు యూ‌ఎస్ లో 2,90,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. టీకాల కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ చాలా పరిశోధనలకు నిధులు సమకూరుస్తోందని గేట్స్ అన్నారు.  

మానవాళి అందరికీ అమెరికా సహాయం చేయాల్సిన అవసరం ఉందని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై  అడిగినప్పుడు, ఇతర దేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే ముందు అమెరికన్లకు పంపిణీ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగాలని, మరణాలను తగ్గించాలని మేము కోరుకుంటున్నాము అని అన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా ఈ టీకాలపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతారని, తాను కూడా ఈ టీకాను బహిరంగంగా తీసుకుంటానని, మస్కూలు ధరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అవి ఖరీదైనవి కావు అని ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ గేట్స్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios