Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మంలో రిలయన్స్ స్మార్ట్ నూతన స్టోర్...ఏడాదిపాటు ఆఫర్లు

రిలయన్స్ స్మార్ట్ నూతనంగా ఏర్పాటు చేయడం వల్ల ఎంఆర్‌పీపై క‌నీసం 6% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ సంవత్సరం పాటు కొనసాగుతుందని వారు చెబుతున్నారు.  దీంతోపాటుగా రూ.1499 విలువ గ‌ల కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌నున్నట్లు చెప్పారు.

new reliance store in khammam city
Author
Hyderabad, First Published Jul 31, 2019, 4:16 PM IST

రిలయన్స్ రిటైల్ కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్ ను ఖమ్మంలో ఏర్పాటు చేసింది. ఖమ్మం నగరంలోని వైఎస్ టరవ్స్, ఎన్ఎస్టీ రోడ్, బాలీజీ నగర్ లో తన మొదటి స్టోర్ ని ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బ‌హుళ‌ విధ‌మైన ఉత్ప‌త్తులను క‌లిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్ప‌త్తులు, పండ్లు మ‌రియు కూర‌గాయ‌లు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్‌వేర్‌, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి.

రిలయన్స్ స్మార్ట్ నూతనంగా ఏర్పాటు చేయడం వల్ల ఎంఆర్‌పీపై క‌నీసం 6% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ సంవత్సరం పాటు కొనసాగుతుందని వారు చెబుతున్నారు.  దీంతోపాటుగా రూ.1499 విలువ గ‌ల కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌నున్నట్లు చెప్పారు.

 తాజాగా ప్రారంభమైన ఖమ్మం స్టోర్‌ క‌లుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 18 కు చేరుకుంది. 29,800 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్త‌మ‌మైన డిజైన్ మ‌రియు లేఔట్ క‌లిగి ఉంది. 

`ప‌వ‌ర్ ఆఫ్ 9` పేరుతో క‌ల్పించిన ప్రారంభోత్స‌వ ఆఫ‌ర్ ద్వారా ఉల్లిగ‌డ్డ‌లు, కొబ్‌ైరికాయ‌లు, ప్లాస్టిక్ కంటెయిన‌ర్ల సెట్ వంటి అనేక ఉత్ప‌త్తులు కేవ‌లం రూ.9 కే (వీటి మార్కెట్‌ ధ‌ర క‌నీసం రూ.999 ఉంటుంది) అందించ‌డం వ‌ల్ల అనేక‌మంది వినియోగ‌దారులు ఆక‌ర్షితులు కానున్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా, రిలయన్స్ స్మార్ట్ త‌న వినియోగ‌దారులకు సంబంధించిన దైనందిన మ‌రియు ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు త‌గిన అవ‌స‌రాల‌ను అన్ని ర‌కాలైన ధ‌ర‌ల‌తో కూడిన ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. వినియోగ‌దారుడిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్త‌మ షాపింగ్ అనుభూతిని త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. 

లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు అందిస్తూ వినియోగ‌దారుల‌కు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన‌దే కాకుండా స్థ‌లం ప‌రంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది. నేడు రిలయన్స్ స్మార్ట్ స్టోర్ లు దేశవ్యాప్తంగా 100 కు పైగా నగరాలలో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios